Homeఎంటర్టైన్మెంట్Singer Suchitra: త్రిష విజయ్ ని కాదు మరో హీరోను ప్రేమిస్తుంది...ఆయనెవరంటే : సింగర్ సుచిత్ర...వైరల్...

Singer Suchitra: త్రిష విజయ్ ని కాదు మరో హీరోను ప్రేమిస్తుంది…ఆయనెవరంటే : సింగర్ సుచిత్ర…వైరల్ వీడియో…

Singer Suchitra: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద చాలామంది హీరోలు తమ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో చాలా మంది స్టార్ హీరోలు ఎవరికి వారు నెంబర్ వన్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ తమిళ్ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. రజనీకాంత్ తర్వాత ఆయనను ఢీకొట్టే హీరో మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన టీవీకే అనే పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. రీసెంట్ గా విజయ్ మీద తన భార్య అయిన సంగీత తన భర్త కి వేరే హీరోయిన్ తో వివాహేతర సంబంధం ఉందని కామెంట్లు చేసింది. ఎలాగైనా సరే తన భర్త నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఇక ఇలాంటి సందర్భంలోనే విజయ్ కి త్రిషకి మధ్య ఎఫైర్ ఉందని తమిళ్ మీడియాలో చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే సింగర్ సుచిత్ర సైతం ఈ విషయం మీద స్పందించింది.

Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు

ఒకప్పుడు ఆమె సూచీ లీక్స్ అంటూ చాలా మంది సెలబ్రిటీల బాగోతాన్ని బయటపెట్టింది. రీసెంట్ గా ఆమె మాట్లాడుతూ త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదని విజయ్ తనకు మధ్య ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదని చెప్పింది.

ఆమె ఉదయనిధి స్టాలిన్ ను ప్రేమిస్తున్నట్టుగా సుచిత్ర చెప్పడం విశేషం… ఇక ఆ మధ్య వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో త్రిష కి ఎంగేజ్మెంట్ అయి పెళ్లి దాకా వెళ్ళినప్పటికి ఆ పెళ్లిని ఆపేసింది కూడా ఉదయం నిధి స్టాలిన్ అంటూ ఆమె చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి త్రిష మీద ఎందుకని ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

నిజంగానే విజయ్ కి తనకి ఏదైనా సంబంధం ఉందా ఆమె ఉదయనిధి స్టాలిన్ ను నిజంగానే ప్రేమిస్తుందా అనే విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సుచిత్ర మాత్రం ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

 

 

Vijay - Sangeetha Divorce ரகசியம் | உண்மை உடைத்த Singer Suchithra Open Talk Interview | IBN Tamil

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version