HomeNewsAnand Mahindra: సునీతా విలియమ్స్ ను కలిశాం.. దాన్నే వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో...

Anand Mahindra: సునీతా విలియమ్స్ ను కలిశాం.. దాన్నే వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో…

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా మనదేశంలో పేరుపొందిన వ్యాపారి. దాతృత్వంలోనూ ఆయన అదే తీరుకొనసాగిస్తారు. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన యాక్టివ్ గా ఉంటారు. తన సంస్థకు సంబంధించిన ఉత్పత్తులనే కాకుండా.. తనకు అత్యంత ఆసక్తి కలిగించిన అంశాలను కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఆయనను ట్విట్టర్లో 11 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులను విభిన్నంగా ప్రమోట్ చేసుకోవడంలో ఆనంద్ మహీంద్రా తర్వాతే ఎవరైనా. అందువల్లే ఆయనను కార్పొరేట్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అని పిలుస్తుంటారు. మనదేశంలో ప్రఖ్యాతమైన ఆటగాళ్లకు.. వివిధ రంగాలలో సేవలందించిన వ్యక్తులకు తన మహీంద్రా కంపెనీ ఉత్పత్తి చేసిన వాహనాలను ఆనంద్ మహీంద్రా అందిస్తుంటారు. వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అందువల్లే ఆయనను సోషల్ మీడియాలో చాలామంది అనుసరిస్తుంటారు. ఆయన పెట్టే పోస్ట్ కూడా క్షణంలోనే వైరల్ అవుతూ ఉంటుంది.

దీన్నే వాషింగ్టన్ ముమెంట్ అంటారేమో..

9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి బుధవారం ఉదయాన్నే భూమ్మీదికి సునీత విలియమ్స్ (Sunita Williams) వచ్చారు. ఆమె రాకను పురస్కరించుకొని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం వాషింగ్టన్ లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) , థర్డ్ టెక్ కో- ఫౌండర్ (Vrinda Kapoor) సునీత విలియమ్స్ (Sunita Williams)ను ఆనంద్ మహీంద్రా కలిశారు. ఆరోజు దిగ్గజ టెక్నాలజీ సంస్థల అధిపతులు సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత భోజనం కోసం ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, వ్రిందా కపూర్ ఎదురు చూస్తుండగా.. అప్పటికే వారి కోసం ఏర్పాటు చేసిన బస్సు వెళ్లిపోయింది. దీంతో వారు ఉబర్ క్యాబ్ లో వెళ్దామని అనుకున్నారు. కారు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సునీత విలియమ్స్ తో ఆనంద్ మహీంద్రా మాట కలిపారు. ” ఉబర్ కారుకు బదులుగా స్పేస్ షటిల్ లో మమ్మల్ని తీసుకెళ్తారా” అని ఆనంద్ మహీంద్రా సునీతను అడిగారు. దానికి ఆమె బిగ్గరగా నవ్వారు. అనంతరం ఆమెతో కలిసి ఆయన సెల్ఫీ తీసుకున్నారు .. సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమ్మీదికి తిరిగి రావడంతో నాడు జరిగిన సంఘటనను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. నాడు సునీత విలియమ్స్ తో జరిగిన సంభాషణను ఆయన “వాషింగ్టన్ మూమెంట్” గా అభివర్ణించారు. సునీత క్షేమంగా భూమి మీదకు తిరిగి రావడానికి ఆయన గొప్ప సంఘటనగా పేర్కొన్నారు. సునీత భూమి మీదకు వచ్చిన తర్వాత ఆనంద మహీంద్రా సందర్భోపేతంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకోవడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వ్యూహ చతురత విషయంలో ఆనంద్ మహీంద్రా తర్వాతే ఎవరైనా అని కామెంట్ చేస్తున్నారు. వ్యాపార పనుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ట్వీట్లు చేయడం ఆనంద్ మహీంద్రా కే చెల్లిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version