Yuvraj Singh 2011 World Cup: ఇండియన్ క్రికెట్ లో యువరాజ్ సింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడిన ఈ క్రికెటర్.. ఎన్నో అపురూప విజయాలను దేశానికి అందించాడు. అటువంటి మ్యాచ్ ల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది 2011 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్. వెస్టిండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ప్రాణాలకు తెగించి భారత్ ను గెలిపించే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ కు నేటితో 12 ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ ఇన్నింగ్స్ ను ఎవరూ మర్చిపోలేరు. నోటి వెంట రక్తం కారుతున్నా గ్రౌండ్ లోనే ఉండి సెంచరీ తో కదం తొక్కి భారత్ కు అపురూపమైన విజయాన్ని అందించి పెట్టాడు యువరాజ్ సింగ్.
వరల్డ్ కప్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న అభిమానుల ఆశ 2011లో తీరింది. 1983లో ఇండియా వరల్డ్ కప్ సాధించింది. ఆ తరువాత నుంచి వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. 2011లో మహేంద్రసింగ్ ధోని సారధ్యంలోని భారత జట్టు మరోసారి వరల్డ్ కప్పును ముద్దాడి దేశాన్ని సగర్వంగా మురిసిపోయేలా చేసింది. భారత్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు జట్టులోని కీలక ఆటగాడు యువరాజ్ సింగ్. వరల్డ్ కప్ మొత్తం అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు యువరాజ్ సింగ్. అయితే, వెస్టిండీస్ తో జరిగిన ఒక మ్యాచ్ లో మాత్రం ప్రాణాలనే పణంగా పెట్టి దేశం కోసం ఆడి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు.
నోటి వెంట రక్తం కోరుతున్న తుది వరకు పోరాటం..
వెస్టిండీస్ తో వరల్డ్ కప్ లో జరిగిన ఒక మ్యాచ్ లో భారత తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. 51 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు యువరాజ్ సింగ్. 123 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ తోపాటు కోహ్లీ మాత్రమే 59 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమైన చోట యువరాజ్ సింగ్ అద్భుతమైన ఆట తీరు కనబరిచి భారత జట్టు 268 పరుగులు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం 269 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టును 188 పరుగులకే అలౌట్ చేయడంతో జట్టు విజయం సాధించింది. బౌలింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన యువరాజ్ సింగ్ నాలుగు ఓవర్ల బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన యువరాజ్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
భారత జెండాను కప్పి తీసుకెళ్లండి..
ఈ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా అప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న యువరాజ్ సింగ్ రక్తపు వాంతులతో మైదానంలో విలవిల్లాడాడు. అయితే, అప్పటికే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వాంతులు చేసుకుంటున్న యువరాజ్ సింగ్ వద్దకు ఫీల్డ్ ఎంపైర్లు వచ్చి.. రిటైర్డ్ హార్ట్ గా వెను తిరుగుతారా అంటే..? ‘నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఆడతా. ఒకవేళ ఆడుతూ నేను పోతే గ్రౌండ్ నుండి స్టెచర్ పైన తీసుకెళ్లేటప్పుడు జాతీయ జెండాను మాత్రమే కప్పి తీసుకెళ్లండి’ అని ధైర్యంగా చెప్పిన దీశాలి యువరాజ్ సింగ్. నోటి నుండి రక్తం కారుతున్నా న్యాప్కిన్ తో తుడుచుకుంటు ఆడి సెంచరీ కొట్టాడు ఈ వీరుడు. క్యాన్సర్ తో పోరాడుతూ 125 కోట్ల మంది ఆశల ప్రపంచకప్ కోసం అనారోగ్యంతో ఆడి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికై దేశానికి కప్ తెచ్చి పెట్టాడు యువరాజ్ సింగ్. అందుకే యువరాజ్ సింగ్ భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో ఒకడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
Web Title: Yuvraj singh remained intact when he coughed up blood to beat west indies in the 2011 world cup
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com