Shani Dosha Nivarana: అల్లనేరేడు పండు చూడటానికి నల్లగా ఉన్నా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా మెండే. దీంతో శరీరంలో మలినాలను శుభ్రం చేస్తుంది. దేవుళ్ల పూజలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శనిదేవుడికి ఈ పండు ఎంతో ఇష్టం. దీన్ని నైవేద్యంగా పెడితే శని సంతోషిస్తాడట. మన మీద ఉన్న దోషాలను తొలగిస్తాడట. అందుకే శనికి ప్రీతిపాత్రమైన దీన్ని పెట్టి కొలవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. మూత్ర సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. నేరేడు పండును శనికి నైవేద్యంగా పెడితే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. పూజ చేసిన తరువాత నేరేడు పండును బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల పలు రోగాల నుంచి బయట పడొచ్చు. ఇలా నేరేడు పండుతో ఎన్నో లాభాలున్నాయి.
నేరేడు పండును శని దేవుడికి ప్రియమైన నల్ల నువ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు తొలగిపోతాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన పండును బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం దూరమవుతుందని నమ్ముతుంటారు. పుణ్య క్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూలం సమేతంగా దానం చేయడం వల్ల భూదానం చేసిన పుణ్యం లభిస్తుంది.
రోజు నేరేడు పండు తినడం వల్ల వ్యాధు బారి నుంచి బయట పడతాం. ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు నేరేడు పండు కూడా పెడితే మంచిది. జీవితంలో మనకు అన్నం పుష్కలంగా దొరుకుతుంది. శని వల్ల కలిగే దుష్ర్పభావాలు జీవితంపై పడకుండా ఉండాలంటే నువ్వుల నూనెతో కానీ ఆముదం నూనెతో కానీ దేవుడిని కొలవడం వల్ల మనకు ప్రతికూలతలు తొలగిపోతాయి.