Mulder refuse to break Lara record: క్రికెట్ ఆటగాడు అయినా సరే తన పేరు మీద సరికొత్త రికార్డులు, అరుదైన ఘనతలు ఉండాలి అనుకుంటాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయం ఉండాలని భావిస్తుంటాడు. అందువల్లే ఈ ఆటగాడైనా సరే బ్యాటింగ్ విషయంలో, బౌలింగ్ విషయంలో, ఫీల్డింగ్ విషయంలో నూటికి నూరు శాతం ప్రతిభ చూపించాలని అనుకుంటారు. కానీ అందరి ఆటగాళ్లకు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మైదానం వెలుపల ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత పరిస్థితులు వేరే విధంగా మారిపోతుంటాయి. అందువల్లే ఆటగాళ్లు వేసిన అంచనాలు వాస్తవ రూపాన్ని దాల్చలేవు. కొంతమంది ఆటగాళ్లకు రికార్డులను సాధించే అవకాశం వస్తుంది. బద్దలు కొట్టే అదృష్టం కూడా ఎదురవుతుంది. వారిలో కొంతమంది రికార్డులను సాధించడానికి ఇష్టపడరు. ఘనతలు అందుకోవడానికి ఆసక్తి చూపించరు. ఎందుకంటే వారికి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది కాబట్టి. అలాంటి లక్షణాలు ఉన్న ఆటగాళ్లల్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ ముల్డర్ ప్రథమ స్థానంలో ఉంటాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా తాత్కాలిక సారధిగా ముల్డర్ కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేతో రెండవ టెస్టు ఆడుతోంది. ఇప్పటికే విజయానికి చేరువైంది. దక్షిణాఫ్రికా జట్టును ముల్డర్ నడిపిస్తున్నాడు. రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 465 రన్స్ చేసింది. ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తాత్కాలిక సారథి ముల్డర్ 264 రన్స్ చేశాడు. ఇక మరుసటి రోజు అతడు మరింతగా తన జోరు చూపించాడు. జట్టు స్కోరును 600 పరుగుల దాకా తీసుకెళ్లాడు. అది కూడా 400 పరుగులకు చేరువయ్యాడు. ఇంకా కొన్ని ఓవర్లు ఆడితే అతడు ఆ ఘనత అందుకునేవాడే. అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ ఆటగాడు బ్రయాన్ లారా 400* పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టేవాడే. కానీ అతడు తనకు ఆ రికార్డు వద్దు అనుకున్నాడు. లారా మీద ఉన్న గౌరవంతో అతడి కేవలం 367 పరుగుల వద్ద మాత్రమే ఆగిపోయాడు. తన జట్టు తొలి ఇన్నింగ్స్ ను 626/5 పరుగుల వద్ద నిలిపివేస్తున్నట్టు ప్రకటించాడు.
తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన జింబాబ్వే దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో 170 పరుగులకే కుప్పకూలిపోయింది. బాంబే బ్యాటర్లను సుబ్ర యెన్ (4/24), కొడి యూసఫ్ (2/2), ముల్డర్ (2/20) చావు దెబ్బ తీశారు. జింబాబ్వే జట్టులో సీన్ విలియమ్స్ (83) మాత్రమే ఆకట్టుకున్నాడు.. ఫాలో ఆన్ లో జింబాబ్వే జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. ఇంకా 405 పరుగులు చేస్తేనే జింబాబ్వే జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటుంది. ఇక తొలి టెస్టులో 328 పరుగుల తేడాతో జింబాబ్వే ఓటమిపాలైంది..
Also Read: గిల్ బృందాన్ని చూసి వణికిపోయిన కావ్య జట్టు కెప్టెన్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
రెండవ టెస్టులో త్రిబుల్ సెంచరీ పూర్తి చేసినప్పటికీ.. లారా రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ముల్డర్ దానికి చేరువ కాలేకపోయాడు..” లారా గొప్ప ఆటగాడు. అతని పేరు మీద మాత్రమే ఆ రికార్డు ఉండాలి.. అందువల్లే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే కాదు భవిష్యత్తు కాలంలో కూడా నాకు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పటికీ నేను లారా రికార్డు బద్దలు కొట్టే ప్రయత్నం చేయను.. లారా అంటే నాకు విపరీతమైన ప్రేమ. అతడి ఆట చూస్తూ పెరిగిన నాకు.. అతని రికార్డులను బద్దలు కొట్టడం అంటే ఇష్టం ఉండదని” ముల్డర్ పేర్కొన్నాడు.
టెస్టులలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే..
2004లో ఇంగ్లాండ్ జట్టుపై లారా 400 పరుగులు చేశాడు. నాట్ అవుట్ గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ జాబితాలో లారా మొదటి స్థానంలో ఉన్నాడు.
రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు హెడెన్ ఉన్నాడు. 2003లో జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు 380 పరుగులు చేశాడు.
1994లో ఇంగ్లీష్ జట్టుపై లారా 375 పరుగులు చేశాడు.
2006లో దక్షిణాఫ్రికా జట్టుపై జయవర్ధన 374 పరుగులు చేశాడు.
ఈ ఏడాదిలో ఎర్విన్ సేన పై సఫారీ జట్టు తాత్కాలిక సారథి 367 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
ఈ ఐదుగురు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఇందులో ఒకటి, మూడవ స్థానం లారా పేరు మీద ఉండడం గమనార్హం. లారా నాలుగు సెంచరీలు చేసిన రికార్డును 2004లోనే నమోదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఆ రికార్డును బద్దలు కొట్టడానికి ప్రయత్నించకపోవడం విశేషం.
MULDER TALKS ABOUT HIS DECLARATION:
“Lara’s Record is exactly where it Should be”. pic.twitter.com/PWwKGlvoL6
— Johns. (@CricCrazyJohns) July 7, 2025