Homeఎంటర్టైన్మెంట్Vishnu Vinyasam Movie Review: విష్ణు విన్యాసం రివ్యూ

Vishnu Vinyasam Movie Review: విష్ణు విన్యాసం రివ్యూ

Vishnu Vinyasam Movie Review :నటీనటులు: శ్రీవిష్ణు, నయన్ సారిక, మురళి శర్మ, గోపరాజు రమణ, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
సంగీతం: రధన్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
దర్శకత్వం: యదునాథ్ మారుతిరావు
నిర్మాతలు: సుమంత్ G. నాయుడు

యువ హీరోలలో మంచి కంటెంట్ తో రెగ్యులర్ గా విజయాలు సాధిస్తున్న శ్రీ విష్ణు తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈసారి నూతన దర్శకుడు యదునాథ్ మారుతిరావు రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. నేల విడిచి సాము చేయకుండా సరదాగా సాగిపోయి కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్న శ్రీ విష్ణు చేసిన ఈ విన్యాసం మరోసారి విజయవంతం అయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

విష్ణు(శ్రీ విష్ణు) జూనియర్ లెక్చరర్ గా ప్రతిభ కాలేజ్ లో పనిచేస్తుంటాడు. జాతకాలు, న్యూమరాలజీ లాంటివి తెగ నమ్ముతాడు విష్ణు. అవి లేకుండా హీరోగారికి ఒక్క రోజు కూడా గడవదు. ఇలాంటి హీరో పనిచేస్తున్న కాలేజికి సీనియర్ గా వస్తుంది మనీషా(నయన్ సారిక). కాస్త వింత ప్రవర్తనతో మనీషా విష్ణుని ప్రేమలో పడేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సందర్భంలో హీరోయిన్ తన జాతకంలో ఒక పెద్ద దోషం ఉందని చెప్తుంది. ఆ దోషం ఎలాంటిది? జాతకాలను మాత్రమే నమ్మే హీరో అలాంటి దోషం ఉన్న హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడా? ఒక వేళ అలా పెళ్లికి రెడీ అయితే ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది మిగతా కథ.

మన సమాజంలో జాతకాలను నమ్మేవారు చాలామంది ఉంటారు. సరిగ్గా అలాంటి పాత్రలనే లీడ్ క్యారక్టర్స్ గా ఎంచుకుని నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ ప్రయత్నంలో కొంతవరకూ నవ్వులు పూసినా కథలో ఎమోషన్స్ పెద్దగా లేకపోవడంతో ప్రేక్షకులకి సంతృప్తి కలగదు. ఫస్ట్ హాఫ్ వరకూ దోషం ఏంటి అనేది చెప్పకుండా సస్పెన్స్ తో నెట్టుకుని వచ్చారు కానీ సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయింది. ఇదొక్కటే కాకుండా హీరో పాత్ర ‘వెంకీ’ సినిమాలో రవితేజ పాత్రను, శ్రీనివాస్ రెడ్డి పోషించిన జ్యోతిష్యుడి పాత్ర అదే సినిమాలో మల్లిఖార్జున రావు పోషించిన పాత్రను పోలి ఉండడంతో ప్రేక్షకులకు కాపీ ఆనే ఫీలింగ్ వస్తే అది మీ సినిమా నాలెడ్జికి ఒక భాస్కర్ అవార్డు లాంటిదే. ఇవే కాకుండా సినిమాలో చాలా సీన్లు ఫ్లాట్ గా రొటీన్ గా ఉన్నాయి. సత్య లాంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ వారి పాత్రలు బలహీనంగా ఉండడంతో కామెడీ అంతగా పండలేదు. సినిమా నిడివి రెండు గంటల ఆరు నిముషాలే అయినప్పటికీ సెకండ్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలిగిందంటే తప్పకుండా అది స్క్రిప్ట్ లో లోపమే.

Also Read: ప్రభాస్ తో నటించి కెరియర్ కోల్పోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళేనా..?

శ్రీవిష్ణు ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా తన స్టైల్ ఫన్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. నిజానికి సినిమాలో నవ్వు వచ్చిన సీన్లు కొన్ని అయినా ఉన్నాయంటే అవి శ్రీవిష్ణు టైమింగ్ వల్లే అని చెప్పాలి. హీరోయిన్ పాత్ర ఇంట్రెస్టింగ్ గానే ఉంది. స్క్రీన్ పైన కూడా అందంగా కనిపించింది. సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, బ్రహ్మాజీ,ప్రవీణ్ లాంటి నటులు ఉన్నప్పటికీ దర్శకుడు వాళ్ళని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు.

రధన్ పాటలు ఒక్కటి కూడా క్యాచీగా లేవు. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా సొసోగానే ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గానే ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా లేకపోవడంతో సెకండ్ హాఫ్ డ్రాగ్ అయినట్టుగా అనిపించింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ లో ఫన్ ఉన్నప్పటికీ ప్రెజెంటేషన్ లో మాత్రం తడబడ్డాడు.

– సినిమాలో బాగోలేనివి ఇవీ..

1. నవ్వురాని జోకులు
2. డల్ గా ఉన్న సెకండ్ హాఫ్
3. సంగీతం

– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?

1. శ్రీవిష్ణు కామెడీ నటన
2. అక్కడక్కడా కాసిన్ని నవ్వులు

Also Read: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో విజయ్ దేవరకొండ,రష్మిక భేటీ..ఫోటోలు వైరల్ !

రేటింగ్: 2/5

ఫైనల్ వర్డ్: సోది విన్యాసం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version