India vs England 2nd Test: ఆసియా ఖండంలో క్రికెట్ పిచ్ లు ప్లాట్ గా ఉంటాయి..ప్లాట్ పిచ్ లపై వికెట్లు తీయడం బౌలర్లకు ఇబ్బందికరంగా మారిపోతుంది. అప్పుడు బ్యాటర్లు పండగ చేసుకుంటారు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోతారు. ఆసియా ఖండం వెలుపల పిచ్ లు మాత్రం భిన్నంగా ఉంటాయి. వీటి మీద బౌలర్లు ఆధిపత్యం చూపిస్తుంటారు. అయితే ఇంగ్లాండ్ పిచ్ లు ఇందుకు భిన్నంగా ఏమీ ఉండవు. అలాంటి చోట బ్యాటర్లు పరుగులు తీయడం కష్టమవుతుంది. బౌలర్లకు ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. అయితే ఈసారి ఇంగ్లాండ్ పిచ్ లు భిన్నంగా ఉన్నాయి. ప్లాట్ గా రూపొందించడంతో పరుగుల వరద పారిస్తున్నాయి. టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటివరకు తలపడిన రెండు టెస్టులలో అదే జరిగింది. టెండూల్కర్ – అండర్సన్ సిరీస్లో తొలి టెస్ట్ ఇంగ్లాండ్, రెండవ టెస్ట్ టీమ్ ఇండియా గెలవడానికి కారణాలు అవే.
Also Read: ఇంగ్లాండ్ పై గిల్ సేన ఘనవిజయం.. పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ సంచలన పోస్ట్.. ఇలా ఎవరూ ఆలోచించి ఉండరు
రెండో టెస్టులో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అసలు విజయమే సాధించని మైదానంలో.. తొలిసారిగా గెలుపును సొంతం చేసుకుంది. అంతేకాదు ప్లాట్ పిచ్ పై భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా సిరాజ్, ఆకాష్ తమ ప్రతిభను నూటికి నూరు శాతం నిరూపించుకున్నారు. బుల్లెట్ లాంటి బంతులు వేయడంతో ఇంగ్లాండు బ్యాటర్లు కోలుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే ప్రతిఘటించినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం తేలిపోయారు. స్మిత్ మినహా మిగతా ఆటగాళ్లు మొత్తం చేతులెత్తేశారు. బ్యాటింగ్ సమర్థవంతంగా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 300 పరుగుల పైచిలుకు వ్యత్యాసంతో ఓటమిపాలైంది.. అయితే ఈ ఓటమి ఇంగ్లాండ్ ప్లేయర్లను మాత్రమే కాదు.. చివరికి ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తోంది. వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్ జట్టు బౌలింగ్లో అదరగొడుతున్నప్పటికీ.. బ్యాటింగ్ లో విఫలమౌతోంది. అందువల్లే ఆస్ట్రేలియా విజయాలు సాధించగలుగుతున్నది.
Also Read: టీమిండియా గెలిచాక ఆ జర్నలిస్ట్ కోసం వెతికిన శుభ్ మన్ గిల్.. కనిపించకుండా పోయాడు
ఇక ఇటీవల కంగారు జట్టు విజయం సాధించిన తర్వాత ఆ జట్టు సారధిని స్థానికంగా ఉన్న విలేకరులు ఇంగ్లీష్ – ఇండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను ప్రస్తావించారు. ముఖ్యంగా రెండవ టెస్టు గురించి ప్రశ్నలు సంధించారు. దానికి ఆస్ట్రేలియా సారథి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. “నేను భారత్ బ్యాటింగ్ చూసాను. అద్భుతంగా ఉంది. భారత జట్టు సారథి తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేశాడు.. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నేను చూడలేదు. కాకపోతే ఇంగ్లీష్ దేశంలో పిచ్ లపై ఇలాంటి వికెట్ నేను చూడలేదు..పిచ్ ప్లాట్ గా ఉంది. అలాంటి పిచ్ పై బౌలింగ్ చేయాలంటే కష్టం. టీమిండియా బౌలింగ్ చూస్తే ఒకరకంగా వణుకు పుట్టడం ఖాయం. వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. ఇలాంటి పిచ్ లు ఇంగ్లాండులో ఎందుకు రూపొందిస్తున్నారో అర్థం కావడంలేదని” కమిన్స్ వ్యాఖ్యానించాడు.