Jadeja master plan: ఒక నాయకుడు తన జట్టులో ఉన్న ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ముఖ్యంగా బౌలర్ల విషయంలో విపరీతమైన ఉదారత చూపించాలి. అప్పుడే జట్టుకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సరిగ్గా రెండో టెస్టులో టీమిండియా సారథి గిల్ ఇదే విధానాలను అనుసరించాడు. అవి జట్టుకు అద్భుతమైన ఫలితాన్ని అందించాయి.
సాధారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో వికెట్లు అంత ఈజీగా లభించవు. వికెట్లు సాధించాలంటే విపరీతమైన సహనం అవసరం. అటు బౌలర్ల కైనా.. ఇటు ఫీల్డర్ల కైనా.. ఓపికతో ఉంటేనే వికెట్లు రాబట్టడానికి సాధ్యమవుతుంది. ఇంగ్లీష్ జట్టు తో జరిగిన రెండవ టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ సారధి స్టోక్స్ ను అవుట్ చేయడానికి టీమ్ ఇండియా బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే అతడు స్మిత్ తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. తను కూడా భారీగానే పరుగులు చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టుకు ప్రమాదకర సంకేతాలను పంపిస్తున్నాడు. ఒకవేళ అతడు గనుక క్రీజ్ లో పాతుకు పోతే టీమ్ ఇండియాకు విజయం దూరం అవుతుంది. విజయం దూరమైతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఆటగాళ్లు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే లంచ్ బ్రేక్ కు కూడా సమయం ఆసన్నమవుతోంది. సరిగ్గా అదే సమయంలో స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా సరికొత్త ప్రణాళిక రూపొందించాడు.
Also Read: ఇంగ్గాండ్ ఓటమిపై బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్
స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్ వేశాడు. అయితే అతడు గనుక బంతులు వేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటే.. మరొక ఓవర్ వేయడానికి అవకాశం ఉండదు. అప్పటికి లంచ్ బ్రేక్ వెళ్లడానికి మూడు నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో జడేజా తన ఓవర్ మొత్తాన్ని త్వరగానే పూర్తి చేశాడు. దీంతో మరొక వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జడేజా బౌలింగ్ పూర్తయిన తర్వాత బంతిని వాషింగ్టన్ సుందర్ అందుకున్నాడు. ప్రతి బంతిని అద్భుతంగా వేశాడు.
వాషింగ్టన్ సుందర్ వేసిన ఒక బంతిని అంచనా వేయడంలో ఇంగ్లాండ్ కెప్టెన్ తడబడ్డాడు. బంతి కాస్త ఇంగ్లాండు కెప్టెన్ ప్యాడ్లను తగిలింది. దీంతో భారత ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా ఉత్సాహపూర్వకమైన వాతావరణం ఏర్పడింది. స్టోక్స్ అవుట్ అయిన తర్వాత స్మిత్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. అతడికి మరో ఆటగాడి నుంచి సహకారం లభించకపోవడంతో.. చివరికి అతను కూడా అవుట్ అయ్యాడు.
Also Read: టీమిండియా గెలిచాక ఆ జర్నలిస్ట్ కోసం వెతికిన శుభ్ మన్ గిల్.. కనిపించకుండా పోయాడు
సుదీర్ఘ ఫార్మాట్లో వికెట్లను వేగంగా తీయాలంటే బంతులను అద్భుతంగా వేయాలి. ఫీల్డింగ్ బాగా చేయాలి. ఇవన్నీ జరగాలంటే ముందుగా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ బుర్ర పాదరసం లాగా పని చేయాలి. అలా పని చేసింది కాబట్టే జడేజా తన మాస్టర్ బ్రెయిన్ వాడాడు. తన ప్రణాళిక గురించి చెబితే వాషింగ్టన్ సుందర్ కూడా ఓకే అన్నాడు. తను కూడా ఫైర్ విల్ ఫైర్ అనే లాగా రెచ్చిపోయాడు. చివరికి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ వికెట్ తీసి అవతల పడేశాడు.
Jadeja
3 mins(180 seconds) left for lunch. Jadeja completes his over quickly in 95 seconds, umpires are forced to go into another over
Washington Sundar gets Ben Stokes!
These small things doesn’t get recognition#INDvsENG | #Jadeja pic.twitter.com/AD12CMLxKv
— Abhi (@abhi_is_online) July 6, 2025