Homeక్రీడలుక్రికెట్‌India Cricket Team Batting Collapse T20 World Cup: టీమిండియాకు కావాల్సింది బ్యాటర్లు కాదు,...

India Cricket Team Batting Collapse T20 World Cup: టీమిండియాకు కావాల్సింది బ్యాటర్లు కాదు, ‘ఆపద్భాందవులు’!

India Cricket Team Batting Collapse T20 World Cup: ప్రస్తుతం టీమిండియా పరిస్థితి ఎలా ఉందంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, ఏకంగా చెట్టునే పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌లో మనవాళ్లు ఆడుతున్న తీరు చూస్తుంటే, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ‘హార్ట్ బీట్’ పెరగడం కంటే, టీవీలు కట్టేయాలనే ‘డిప్రెషన్’ ఎక్కువ వస్తోంది. సౌతాఫ్రికా చేతిలో తగిలిన 76 పరుగుల దెబ్బకు సెమీస్ ఆశలు కాస్తా.. అటకెక్కినట్లే కనిపిస్తున్నాయి.

వరుసలు కడుతున్న వికెట్లు.. వినోదం పంచుతున్న ప్రత్యర్థులు!

క్రికెట్‌లో ‘టాప్ ఆర్డర్’ అంటే ఇన్నింగ్స్‌ను నిర్మించేవారు అనుకుంటాం. కానీ మన జట్టులో మాత్రం వారు కేవలం ‘అటెండెన్స్’ వేయించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లడానికే పరిమితం అవుతున్నారు. న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

కివీస్ కిటుకు: 84 పరుగులకే 6 వికెట్లు పడితే.. శాంట్నర్, మెక్‌కొన్చీ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

విండీస్ విధ్వంసం: 83 పరుగులకే 7 వికెట్లు పోయినా, షెపర్డ్ – హోల్డర్ కలిసి స్కోరును 170 దాటించారు.

మరి మనవాళ్లో? వికెట్లు పడుతుంటే ‘తర్వాత నీదా.. నాదా?’ అన్నట్లు ఒకరి వెనుక ఒకరు క్యూ కడుతున్నారు. లోయర్ ఆర్డర్ లో ‘ఆపద్భాందవులు’ రాకపోగా.. కనీసం ‘అడ్డుకట్ట’ వేసే నాథుడే కరువయ్యాడు.

సూర్య ఒక్కడే ఏం చేస్తాడు?

పాపం, సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి బ్యాట్ ఊపుతాడు? యూఎస్‌ఏ మీద ఆదుకున్నాడు సరే.. పాకిస్థాన్‌పై ఇషాన్ కిషన్ కాస్త మెరిశాడు సరే. మరి మిగిలిన వాళ్ళంతా ‘గెస్ట్ అప్పీరెన్స్’ ఇవ్వడానికే వచ్చారా? సౌతాఫ్రికా మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, బ్రెవిస్ బాదుతుంటే మనవాళ్లు ఫీల్డింగ్‌లో విన్యాసాలు చూశారు. తీరా ఛేదనకు వచ్చేసరికి మార్కో యాన్సెన్ బంతులకు మన బ్యాటర్లు ‘సరండర్’ అయిపోయారు. శివం దూబే గాలిలో బ్యాట్ ఊపాడు కానీ.. అది స్కోరు బోర్డును మాత్రం కదిలించలేకపోయింది.

జింబాబ్వేపై ‘జైత్రయాత్ర’

ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై కేవలం గెలిస్తే సరిపోదు, వాళ్లని ‘క్లీన్ స్వీప్’ చేసి రన్ రేటును ఆకాశానికి తీసుకెళ్లాలి. మనవాళ్లు ఫామ్‌లోకి రావాలంటే ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉండక్కర్లేదు, మనలో ‘కసి’ ఉండాలి. కానీ ఇప్పుడు కసి కంటే ‘కన్ఫ్యూజన్’ ఎక్కువగా కనిపిస్తోంది.

శ్రీలంక ఇప్పటికే బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోయింది. టీమిండియా కూడా అదే దారిలో వెళ్లకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మనకు ఇప్పుడు కావాల్సింది కేవలం క్రికెటర్లు కాదు.. క్రీజులో పాతుకుపోయే ‘అవతార పురుషులు’. ఒత్తిడిలో చిత్తయ్యే తత్వం వదిలేసి.. సమిష్టిగా పోరాడకపోతే, వరల్డ్ కప్ మనకు కేవలం ఒక ‘టూరిస్ట్ ట్రిప్’ లాగే మిగిలిపోతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version