Australia vs Pakistan T20 Series : ప్రస్తుతం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ పితృత్వ సెలవులో వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో పాకిస్థాన్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ కు కొత్త కెప్టెన్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది. మార్ష్ కు బదులుగా తనను కెప్టెన్ గా నియమించాలని మాథ్యూ షార్ట్ ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ను కోరుతున్నాడు. అయితే షార్ట్ 20 కంటే తక్కువగానే టి20 క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. బిగ్ బాష్ లీగ్ సీజన్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. షార్ట్ తోపాటు గ్లెన్ మాక్స్ వెల్, ఆడం జంపా, జోస్ ఇంగ్లీస్ కూడా కెప్టెన్ జాబితాలో ఉన్నారు..” ప్రస్తుతం నేను ఆడిలైట్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడాను. నా సారధ్య బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాను. ఒకవేళ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు నన్ను నాయకత్వం వహించమని కోరితే ఆ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తాను. అయితే వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ నాకు అవకాశం కల్పిస్తే నా బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తానని” షార్ట్ పేర్కొన్నాడు. షార్ట్ బిగ్ భాష్ లీగ్ లో 11 మ్యాచ్ లు ఆడి 541 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాటర్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతడేకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా పురస్కారం దక్కించుకున్నాడు. షార్ట్ మాత్రమే కాకుండా ఐపీఎల్ లో ఆకట్టుకున్న జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా కెప్టెన్ పోటీలో ఉన్నాడు. పైగా ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 క్రికెట్ మ్యాచ్ లో గుర్క్ తన తొలి అంతర్జాతీయ ఆఫ్ సెంచరీ చేశాడు.. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న వన్డే టోర్నీలో షార్ట్, గుర్క్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు.
నవంబర్ 14 నుంచి..
పాకిస్తాన్ జట్టుతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టి20 సిరీస్ ప్రారంభం అవుతుంది. నవంబర్ 14న బ్రిస్బెన్ వేదికగా టి20 సిరీస్ మొదలవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు. గిలెస్పీ శిక్షణ ఇస్తున్నాడు. అతడు షార్ట్ సామర్థ్యాన్ని గుర్తించాడు. నెట్స్ లో షార్ట్ సాధన చేస్తుండడాన్ని గిలెస్పీ దగ్గరుండి చూశాడు. ” షార్ట్ యువ ఆటగాడు. వేగంగా ఆడతాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవల తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేశాడు. తదుపరి ఆస్ట్రేలియా జట్టును ముందుకు నడిపించడంలో అతడికి సామర్థ్యం ఉంది. ఆ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటే అతడికి తిరుగు ఉండదు. అందుకే అతడు కెప్టెన్ కావాలని భావిస్తున్నాడు. తన కోరికను పలు సందర్భాల్లో మీడియా ముందు ఉంచాడు. ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందో తెలియదు కాని.. ప్రస్తుతం అయితే ఆశావహుల జాబితాలో అతడు కూడా ఒకడు. చూడాలి మరి ఏం జరుగుతుందోనని” ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.. పాకిస్థాన్ జట్టుతో వన్డే, టీ 20 సిరీస్ లు ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా భారత జట్టుతో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టులు ఆడతాయి.