Pakistan vs Bangladesh: 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభ ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఉత్కంఠ భరితమైన విజయం సాధించింది. ఆ తర్వాత 2009లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. అప్పటి పాకిస్తాన్ జట్టులో గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉండేవారు. వారంతా కూడా అద్భుతమైన ప్రదర్శన చేసేవారు. రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్టు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నాసిరకంగా మారిపోయింది.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
విజయాలను పక్కన పెడితే కనీసం సగౌరవమైన పోటీ ఇవ్వలేని స్థితికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేరుకుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు t20 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించినప్పటికీ.. ఆ గెలుపును సగర్వమైనదిగా పాకిస్తాన్ ప్లేయర్లు చెప్పుకోలేకపోయారంటే సిరీస్ ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల జరిగిన ఓ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లోనే పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. టి20 వరల్డ్ కప్ లో విఫల ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. ఆ జట్టుతో బుధవారం తొలి వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు బౌలర్లకు పాకిస్తాన్ ప్లేయర్లు దాసోహం అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లు కనీసం 50 ఓవర్ల పాటు కూడా బ్యాటింగ్ చేయలేకపోయారు. 30 ఓవర్లలోనే 114 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అష్రఫ్ (37), ఫర్హాన్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నలుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్, ఇద్దరు ఆటగాళ్లు సున్నాకే అవుట్ కావడం తో పాకిస్తాన్ కనీసం 120 పరుగులు కూడా చేయలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ 5, మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం చేజింగ్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ తమీం (67*) మెరుపు హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. శాంటో 27 పరుగులు చేశాడు. 3 వన్డేల సిరీస్లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ గెలిచి.. అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది. ఈ వన్డే సిరీస్లో రెండవ మ్యాచ్ శుక్రవారం డాకా వేదికగా జరుగుతుంది. బంగ్లాదేశ్ లో జరిగే సిరీస్ లో ఎలాగైనా విజయం సాధించాలని పాకిస్తాన్ భావించింది. జట్టులో అనేక మార్పులు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పాకిస్తాన్ దారుణమైన ఓటమి నేపథ్యంలో ఇకపై కెన్యా, మంగోలియా జట్లతో మ్యాచ్ లు ఆడాలని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.
07 Balls
04 Runs
One catch dropShamyl Hussain dismissed for 4 runs on his debut pic.twitter.com/UC5O7RQjRx
— Zubair Ali Khan (@ZubairAlikhanUN) March 11, 2026