https://oktelugu.com/

CM Chandrababu: ఆ మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. ఆడియో లీక్.. వైరల్

ప్రభుత్వ పెద్దలకు ఫోన్ లీకులు తప్పడం లేదు. తాజాగా సీఎం చంద్రబాబు ఓ మంత్రిని హెచ్చరిస్తూ చేసిన సూచనలకు సంబంధించి ఆడియో ఒకటి బయటపడింది. పార్టీ సభ్యత్వ నమోదు పై చంద్రబాబు హెచ్చరిస్తూ ఓ జూనియర్ మంత్రికి జారీచేసిన ఈ సూచనలు ఆడియో రూపంలో బయటపడ్డాయి. సోషల్ మీడియాలో వైసిపి దీనిపై తెగ ప్రచారం చేస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 4, 2024 / 02:35 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు అవుతోంది.గతానికి భిన్నంగా చంద్రబాబు ఈసారి క్యాబినెట్లోకి జూనియర్లను తీసుకున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పదిమందికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇదంతా లోకేష్ కోసమేనని ఒక ప్రచారం ఉంది. కానీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకేనని చంద్రబాబు చాలాసార్లు చెప్పుకొచ్చారు. మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని కూడా సూచించారు. ఇందుకుగాను మూడు నెలల వ్యవధి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సీనియర్లను పక్కన పెట్టి మరి అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పాలనాపరంగా మెరుగైన సేవలు అందించడంతోపాటు పార్టీకి కూడా ఉపయోగపడాలని చంద్రబాబు హితబోధ చేశారు. కానీ కొంతమంది మంత్రుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చంద్రబాబు పదేపదే హెచ్చరించిన వారి వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు ఓ జూనియర్ మంత్రికి హెచ్చరిస్తున్నట్లు.. ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 100 రూపాయలతో సభ్యత్వం నమోదు చేసుకుంటే 5 లక్షల బీమా కూడా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోంది సభ్యత్వ నమోదు కార్యక్రమం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా డల్ గా ఉంది. ఈ తరుణంలో ఓ జూనియర్ మంత్రి నియోజకవర్గంలో 20 శాతం కూడా సభ్యత్వ నమోదు కాలేదని తెలుస్తోంది. దీంతో సదరు మంత్రికి చంద్రబాబు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఆ మంత్రి వాసంశెట్టి సుభాష్ అని ప్రచారం సాగుతోంది.

    * తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి
    కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలిచారు వాసంశెట్టి సుభాష్. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్ కు మంత్రి పదవి తలుపు తట్టింది. అయితే ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా టిడిపి నిర్వహిస్తున్న సభ్యత్వ డ్రైవ్ లో ఆయన విఫలమైనట్లు సమాచారం. తనకు ఇచ్చిన టార్గెట్లో కేవలం 20 శాతమే పూర్తి చేయగలిగారని సమాచారం. దీంతో సీఎం చంద్రబాబు నేరుగా ఆయనకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లు తాజాగా ఓ ఆడియో కాల్ వైరల్ అవుతోంది. అయితే దీనిని వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుండడంతో టిడిపి శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.

    * కాస్త గట్టిగానే హెచ్చరించిన చంద్రబాబు
    అయితే ఈ ఆడియో కాల్ లో మాత్రం చంద్రబాబు సీరియస్ హెచ్చరిక జారీ చేసినట్లు అర్థమవుతోంది.’ నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివి అయ్యావు.. నువ్వు అన్ని మాట్లాడవద్దు.. నువ్వు యంగ్ స్టార్ వి.. నీకు ఇంకా రాజకీయాల పట్ల సరైన అవగాహన లేదు.. నీ నియోజకవర్గ ఎక్కడ అనేది నువ్వు చూసుకున్నావా’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ మంత్రి తో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఎలా బయటకు వచ్చాయి అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. సొంత పార్టీ నేతల పైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ఫోన్ సంభాషణ బయటపడటంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది.