Homeలైఫ్ స్టైల్Black Ants Astrology: నల్ల చీమలు ఇంట్లో వరుసగా వస్తున్నాయా? మీ ఇంట్లో ఇది జరుగుతుంది

Black Ants Astrology: నల్ల చీమలు ఇంట్లో వరుసగా వస్తున్నాయా? మీ ఇంట్లో ఇది జరుగుతుంది

Black Ants Astrology: జీవితంలో కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఆర్థికంగా వృద్ధి సాధించలేరు. అందుకు తనకు అదృష్టం లేకపోవడమేనని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటారు. అయితే కష్టపడుతూనే అప్పుడప్పుడు దైవాన్ని ఆరాధిస్తే జాతకంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. దీంతో అనుకున్నది సాధించడానికి బలం చేకూరుతుంది. కొందరు ఇలా చేయడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. అయితే లక్ష్మీ కటాక్షం రావాలంటే పూజలు, యాగాలు కాకుండా మనస్పూర్తిగా దైవాన్ని కొలిచినా సహకరిస్తారు అని అంటున్నారు. ఈ తరుణంలో మనస్ఫూర్తిగా భగవంతుడిని కొలిస్తే ఒక్కోసారి దైవం కరుణించే అవకాశం ఉంది. మరి మనపై దైవం కరుణించాడని మనకు ఎలా తెలుస్తుంది?

మన ఇళ్లల్లో కొన్ని మార్పులు చూస్తుంటాం. కానీ వాటిని పట్టించుకోం. ఇవి రోజూవారీ సాగేవే. కానీ ఇందులోనూ అసలు విషయం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. వర్షాకాలం రాగానే ఎన్నో కీటకాలు ఇంట్లో చేరుతూ ఉంటాయి. ముఖ్యంగా నల్ల చీమలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొందరు ఇళ్లలో ఎప్పుడూ చూడని నల్లచీమలు వారి ఇంట్లో కనిపిస్తాయి. వరసబెట్టి ఒక ప్రదేశానికి వెళ్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఇంట్లో త్వరలో మంచి జరగబోతుందని అర్థం అని అంటున్నారు.

చీమలు మాత్రమే కాకుండా బల్లిని కూడా దైవంగా కొలుస్తారు చాలా మంది. మనం ఏదైనా అనుకునే టప్పుడు బల్లి పలికితే అది అవుతుందని నమ్ముతాం. అయితే కొన్ని బల్లులు వరుసగా వస్తుంటాయి. వాటిని చూస్తే చికాకు అనిపిస్తాయి. ఒక బల్లిని మరో బల్లి వెంటాడుతుంది. ఆలా బల్లులు పరుగులు తీస్తున్నాయంటే దానర్థం ఆ ఇంట్లో మంచి జరగబోతుందని తెలుసుకోవాలని అంటున్నారు. బల్లి సాధారణ సమయంలో కాకుండా దీపావళి రోజున తులసి చెట్టు వద్ద కనిపిస్తే ఇంకా మంచిదని అంటున్నారు.

పైన చెప్పినవి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తే మరికొన్ని మాత్రం దరిద్రాన్ని తీసుకొస్తాయి. వాటిలో మొదటిది స్పైడర్. ఇది ఇంట్లోకి వచ్చిందంటే ఆ ఇంట్లో ఏదో అశుభం కలుగుతుందని అర్థం. ఓ మూలన ఇది గూడు కట్టిందంటే వెంటనే బూజు కర్రతో తీసేయడం బెటర్. అలాగే ఇంట్లోకి చెదలు పురుగులు ఎంట్రీ ఇస్తే కూడా మంచిది కాదంటున్నారు. ఇక ఇంట్లకి పాము చొరబడిందంటే ఆ ఇంట్లో కూడా మంచి జరగదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version