Virat : ఎలాంటి మైదానమైనా సరే పరుగులు తీస్తాడు. జట్టు అవసరాల దృష్ట్యా తన ఆటతీరును మార్చుకుంటాడు. కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆడతాడు. మరికొన్ని సందర్భాల్లో సమయం మనంతో ఆడతాడు. అదృష్టం బాగోలేకపోతే తప్ప.. మిగతా సందర్భాల్లో అనామకంగా మాత్రం ఆడడు. గొప్పగా బ్యాటింగ్ చేస్తాడు. అంతే స్థాయిలో పరుగులు రాబడతాడు. అందువల్లే అతడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాడు. అన్ని అనుకూలిస్తే సచిన్ రికార్డులను కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడు. ఎందుకంటే అతడి వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు మాత్రమే. ఆయనప్పటికీ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వీరోచితంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హీరోచితమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
Also Read : వీర విహారం చేసే విరాట్ కెప్టెన్సీ ని ఎందుకు వదిలేసాడు.. ఇన్నాళ్లకు తెలిసిన అసలు నిజం!
బెంగళూరుకు వెన్నెముక
2008లో బెంగళూరు జట్టులో ప్రవేశించిన విరాట్ కోహ్లీ .. ఇప్పటివరకు అదే జట్టుకు ఆడుతున్నాడు. ప్రారంభంలో ముఖ్య ఆటగాడిగా.. ఆ తర్వాత కెప్టెన్ గా.. ఇప్పుడు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో భీకరమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ.. అరుదైన ఘనత సాధించాడు. బెంగళూరు ప్రస్తుత ఐపిఎల్ లో ఇప్పటివరకు సాధించిన పరుగులలో విరాట్ కోహ్లీ కాంట్రిబ్యూషన్ 26.06 శాతం ఉందంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ముంబై జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కాంట్రిబ్యూషన్ 24.09% ఉంది. ఈ జాబితాలో సూర్య కుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లు సాయి సుదర్శన్ 23.90, గిల్ 23.85, బట్లర్ 23.47 శాతంతో కొనసాగుతున్నారు. గుజరాత్ జట్టుకు వీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఉన్నారు. ఇక పంజాబ్ జట్టుకు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 21.46 శాతంతో తన కాంట్రిబ్యూషన్ అందించాడు. యశస్వి జైస్వాల్ రాజస్థాన్ జట్టుకు 21.34, ఢిల్లీ జట్టుకు కేఎల్ రాహుల్ 20.72, పంజాబ్ జట్టుకు అయ్యర్ 19.89, లక్నో జట్టుకు పూరన్ 19.85 శాతం కాంట్రిబ్యూషన్ అందించారు. అయితే ఈ గణాంకాలు మే 6 వరకు జరిగిన మ్యాచ్లను పరిశీలనకు తీసుకొని వెల్లడించినవి.. అయితే ఈ సీజన్లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. జట్టు అవసరానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తద్వారా ఈ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశానికి దగ్గర అయింది. గత సీజన్లోను బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. వరుసగా మ్యాచులు ఓడిపోయినప్పటికీ.. మళ్లీ అదే స్థాయిలో గెలిచి ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. ఈసారి మాత్రం ప్రారంభం నుంచే బెంగళూరు జట్టు అదరగొడుతోంది.
Also Read : గేల్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా ఘనత..