Virat Kohli: తగ్గే చోట తగ్గి ఉంటాడు విరాట్ కోహ్లీ. తగ్గివున్నాడని ఎక్కువ చేస్తే.. ఎదుటివారి తొక్క తీస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానులు ఉన్నారు. అతడు ఆడుతుంటే.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంటే.. అలా రెప్పవాల్చకుండా చూస్తుంటారు. అందుకే విరాట్ కోహ్లీకి టీమ్ ఇండియాలో కింగ్ అనే బిరుదు వచ్చింది. సమకాలీన క్రికెట్లోనే కాదు అంతకుముందు క్రికెట్ ఆడిన ఏ ఆటగాడు కూడా కింగ్ అనే బిరుదును పొందలేకపోయాడు. వాస్తవానికి సచిన్ లాగా.. బ్యాటింగ్ చేయాలని.. సచిన్ రికార్డులను బద్దలు కొట్టాలని చాలామంది ఆటగాళ్లు అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ దానిని చేతల్లో చూపించాడు. అందుకే సచిన్ తర్వాత సమకాలీన క్రికెట్ మీద ఆ స్థాయిలో ప్రభావం చూపించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇక ఇప్పటి కాలంలో విరాట్ కోహ్లీకి సరి సమానంగా నిలిచే ఆటగాళ్లు టీమిండియాలోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనే లేరు. ఈ మాట అనడం వెనుక ఏమాత్రం అతిశయోక్తి లేదు.
ఎందుకు వదిలేశాడంటే..
విరాట్ కోహ్లీ టీమిండియాలో దిగ్గజ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఒకానొక సందర్భంలో నాయకత్వం వహించాడు. ఇప్పుడు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అప్పట్లో టీమ్ ఇండియా సారధ్య బాధ్యతల నుంచి ఎందుకు వైదొలిగాడు అనే విషయాన్ని విరాట్ కోహ్లీ బయట పెట్టలేదు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ దాని వెనుక జరిగిన పరిణామాలను వివరించాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా 2021 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్ బాధ్యతలకు దూరం జరిగాడు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టుతో ఎదురైన ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు.. ఇక కొద్ది రోజులకు ఐపీఎల్లో బెంగళూరు జట్టు బాధ్యతలను కూడా వద్దనుకున్నాడు..” ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద మీపరితమైన అంచనాలు పెరిగాయి. చాలామంది నా నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించేవారు. అది ఒక రకంగా నామీద ఒత్తిడి మాదిరిగా ఉండేది. ఆ ఒత్తిడి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది. అందువల్లే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. ఆ ఒత్తిడి వల్ల నేను నా బ్యాటింగ్ మీద మనసు లగ్నం చేసేవాడిని కాదు. చేసే అవకాశం కూడా ఉండేది కాదు. టీమ్ ఇండియాకు దాదాపు 8 సంవత్సరాలు పాటు నాయకుడిగా ఉన్నాను. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు 9 సంవత్సరాలు నాయకత్వం వహించాను.. నేను ఆడుతున్న ప్రతి మ్యాచ్ లోను అంచనాలను అమాంతం పెంచేసేవారు. అది నా మీద తీవ్రమైన ప్రభావం చూపించేది. అందువల్లే నెమ్మదిగా నాయకత్వ బాధ్యతల నుంచి దూరం జరగడం మొదలుపెట్టాను. ద్వారా నాకు స్వేచ్ఛ లభించినట్టు అయింది. అప్పటినుంచి స్వేచ్ఛగా ఆడటం ప్రారంభించాను. ఐపీఎల్ లోను మెరుగ్గా పరుగులు చేస్తున్నాను.. అప్పట్లో నన్ను కెప్టెన్ ధోని.. టీ మీడియా కోచ్ గ్యారి కిర్ స్టెన్ నన్ను విపరీతంగా ప్రోత్సహించేవారు. నాకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాన్ని వారు కల్పించారు. నేను నా నేచురల్ స్టైల్ లో బ్యాటింగ్ చేసే ఎన్విరాన్మెంట్ వాళ్లు కల్పించారు. నేను ఇప్పుడు ఇలా బ్యాటింగ్ చేయగలుగుతున్నాను. నా బ్యాటింగ్ మీద నేను పూర్తిస్థాయిలో సంతృప్తిగా ఉన్నాను. ఇదే జోరు వచ్చే రోజులలోనూ కొనసాగిస్తే నా ఆటకు సార్థకత లభించినట్టేనని” విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.