Shubham : ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా వ్యవహరించిన మొట్టమొదటి చిత్రం ‘శుభమ్'(Subham Movie) రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. అయితే విడుదలకు ముందే సమంత హైదరాబాద్ లో ఒక మూడు స్పెషల్ ప్రీమియర్ షోస్ ని నిన్న ఏర్పాటు చేసింది. ఈ మూడు ప్రీమియర్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. అందులో ఒక ప్రీమియర్ షో సినీ ఇండస్ట్రీ లోని తనకు అత్యంత సన్నిహితులకు ఏర్పాటు చేసింది. నిన్న జరిగిన ఈ ప్రీమియర్ షోకి సమంత కూడా పాల్గొన్నది. అందుకు సంబందించిన వీడియో ని మీరు ఈ ఆర్తికి చివర్లో చూడొచ్చు. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఒక సరికొత్త అనుభూతితో బయటకు వచ్చామని కామెంట్స్ చేస్తున్నారు. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మంచి ఉత్కంఠ భరితమైన స్క్రీన్ ప్లే తో, చాలా ఫన్నీ గా తీసాడట డైరెక్టర్.
Also Read : నిర్మాతగా కూడా సమంత సక్సెస్ అయ్యినట్టే..ఆకట్టుకుంటున్న ‘శుభం’ టీజర్ !
రేపు ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తే, ఈ ఏడాది థియేటర్స్ లో సెన్సేషన్ సృష్టించిన మరో చిన్న సినిమాగా నిలుస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ని సీరియల్స్ ని పిచ్చి గా చూసే అమ్మాయిగా చూపించారు. సీరియల్ చూసినప్పుడల్లా ఆమె ఈ ప్రపంచాన్ని మర్చిపోయి దెయ్యం లాగా ప్రవర్తిస్తుంది. అలా ఎందుకు చేస్తుంది అనేదే ఈ చిత్రంలో ఆసక్తికరమైన పాయింట్. ఇందులో సమంత కూడా ఒక కీలకమైన పాత్ర పోషించింది. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన ఒక పాట ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందులోని ఒక హుక్ స్టెప్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రీమియర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో రేపు తేలనుంది.
ఈ చిత్రం లో సమంత తప్ప, ఒక్క ఆర్టిస్ట్ కూడా మనకు తెలిసిన ముఖం కాదు. అంతా కొత్తవాళ్ళను ఎంచుకొని సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇలాంటి విన్నూతన ప్రయత్నాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. తన ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే ప్రతీ ఒక్కరికి సమానమైన రెమ్యూనరేషన్స్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చిన సమంత, ఈ సినిమాలో పనిచేసిన హీరో దగ్గరి నుండి క్యారక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరికీ సరిసమానమైన రెమ్యూనరేషన్ ని అందించింది. ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ అయితే ఇక మీదట కూడా తన ప్రొడక్షన్ హౌస్ నుండి ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్తవాళ్లను పరిచయం చేస్తానంటూ ఈ సినిమా ప్రొమోషన్స్ లో సమంత చేసిన కామెంట్స్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంది.
Also Read : నాగచైతన్య పై సమంత కామెంట్స్ ఆగేలా లేవుగా?