Rohith Sharma : రోహిత్ శర్మ ఆధ్వర్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ వెళ్ళింది. రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది. 2024 లో టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. దక్షిణాఫ్రికా పై గెలిచిన ఆ మైదానంలో భారత జాతీయ జెండాను ప్రతిష్టించాడు. అంతేకాదు అత్యంత ఉద్వేగంగా మైదానాన్ని తన చేతులతో పదేపదే గట్టిగా గుద్దాడు. ఆ సందర్భాన్ని సగటు భారతీయ అభిమాని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఇటీవల దుబాయ్ (టీమిండియా ఇక్కడే హైబ్రిడ్ విధానంలో మ్యాచ్ లు ఆడింది) వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఎదురైన ప్రతి మ్యాచ్ ను భారత్ గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో రెండుసార్లు తలపడగా.. ఒకసారి గ్రూప్ దశలో.. మరొకసారి ఫైనల్ దశలో..రెండుసార్లు కూడా గెలిచింది. అంతిమంగా 2013 తర్వాత మళ్లీ 2025లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2017 లోనూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వెళ్లినప్పటికీ.. పాకిస్తాన్ చేతిలో భారత్ దారుణమైన పరాజయం పాలయింది.
Also Read : శిష్యుడు కేఎల్ రాహుల్ ను చూసి ఉప్పొంగిపోయిన రాహుల్ ద్రావిడ్.. వీడియో వైరల్
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమ్ ఇండియాను రెండుసార్లు ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో విజేతగా నిలిపి రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ వెళ్ళింది. మొత్తానికి అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియాను రోహిత్ శర్మను నిలబెట్టాడు. అంతేకాదు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించాడు. అంతేకాదు ఐపిఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ని రోహిత్ నిలబెట్టాడు. అయితే రోహిత్ అటు టీమ్ ఇండియాకు.. ఇటు ముంబై ఇండియన్స్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన నేపథ్యంలో.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.. దీనికి సంబంధించిన వివరాలు జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి.” రోహిత్ అద్భుతమైన ఆటగాడు. టీమ్ ఇండియాకు ఎనలేని సేవలు అందించాడు. ముంబై ఇండియన్స్ జట్టు కూడా అద్భుతమైన విజయాలు అందించాడు. అతడు అందించిన విజయాలకు గుర్తుగా వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు రోహిత్ పేరు పెట్టాలని నిర్ణయించారు. సచిన్ టెండూల్కర్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో గౌరవం అందుకున్న ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతడు అందించిన సేవలకు గుర్తుగా ఇలాంటి గౌరవం ఇవ్వడం గొప్ప విషయమని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. రోహిత్ పేరును ఒక స్టాండ్ కు ఏర్పాటు చేయడం ద్వారా మొత్తంగా అతడికి గొప్ప గౌరవం ఇచ్చినట్టు అయిందని నెటిజన్లు అంటున్నారు.
ROHIT SHARMA STAND IN WANKHEDE
MCA AGM has approved the stand for World Cup winning Captain Rohit Sharma at Wankhede. [@pdevendra From Express Sports] pic.twitter.com/RM0yG67xtx
— Johns. (@CricCrazyJohns) April 15, 2025