MS Dhoni Fan Uppal Balu
Uppal Balu : సాయంత్రమైతే చాలు టీవీలకు, స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. వీనుల విందైన క్రికెట్ మ్యాచ్లను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. అసలైన క్రికెట్ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులు తమ జట్టుపై ఉన్న ప్రేమను ఒక్కో విధంగా వ్యక్తం చేస్తున్నారు. అందులో ఉప్పల్ బాలు కూడా ఒకడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఉప్పల్ బాలు.. చిత్ర విచిత్రమైన వీడియోలు చూస్తూ అలరిస్తుంటాడు. ఆ వీడియోలు కొంతమందికి నచ్చకపోవచ్చు గాని.. చాలామంది అతడిని అనుసరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అతడు చేసే అతి ఇబ్బంది కలిగిస్తుంది. అయినప్పటికీ ఒక సెక్షన్ అభిమానులు అతడిని ఎంకరేజ్ చేస్తుంటారు.
Also Read : ముంబై ఇండియన్స్ కు ఏంటీ దరిద్రం.. రోహిత్ ఇంత దారుణమా?
ధోనిపై విపరీతమైన ప్రేమ
ఉప్పల్ బాలుకు చెన్నై జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టం. అతనిపై ఉన్న అభిమానాన్ని అనేక సందర్భాల్లో బయట పెట్టుకున్నాడు. ఇక ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 155 రన్స్ చేసింది. 156 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై..19.1 ఓవర్లలో దానిని ఫినిష్ చేసింది. అయితే చివర్లో చెన్నై జట్టు విజయానికి ఆరు బంతుల్లో నాలుగు పరుగులు కావలసి వచ్చింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా రన్ అవుట్ అయ్యాడు. దీంతో ధోని బ్యాటింగ్ కు దిగాడు. అతడు రెండు బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగులు చేయలేకపోయాడు. ఈ దశలో ఉప్పల్ బాలు టీవీ దగ్గరికి వచ్చి.. ధోని రెండు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాలని కోరాడు. ధోని కోసమే తాను ఎల్లో షర్ట్ వేసుకున్నానని వ్యాఖ్యానించాడు. ధోని వేసుకుంది ఎల్లో జెర్సీ.. నేను ధరించింది ఎల్లో షర్ట్… ఇది నా ప్రేమకు గుర్తు.. నా అభిమానానికి సంకేతం అని అతడు వ్యాఖ్యానించాడు. అయితే ఈ మ్యాచ్లో ధోని ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం విశేషం. ఉప్పల్ బాలు మాట్లాడిన ఆ వీడియోను చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.. కొందరేమో ఉప్పల్ బాలును అభినందిస్తుండగా.. మరికొందరేమో అతనిని విమర్శిస్తున్నారు.. నీ అభిమానం ఇలా ఉందేంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఉప్పల్ బాలు హైదరాబాదులో పుట్టినప్పటికీ.. చెన్నై మాజీ కెప్టెన్ ధోని పై విపరీతమైన ఆరాధన భావాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ – రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కు ఉప్పల్ బాలు హాజరయ్యాడు. హైదరాబాద్ జట్టు గెలవాలని కోరుకున్నాడు. హైదరాబాద్ జట్టుకు సంఘీభావంగా ఆరెంజ్ జెర్సీ వేసుకొని సందడి చేశాడు.
Also Read : బౌలర్ బాల్ ట్యాంపరింగ్..MI పై అందుకే గెలిచిందా?
Rey pic.twitter.com/2BPIzef3kU
— Anvesh_NTR (@AnveshRolex) March 23, 2025