Mumbai Indians
MI vs CSK : కొద్ది సీజన్లుగా ముంబై ఇండియన్స్ ఆశించినంత స్థాయిలో ప్రతిభ చూపించడం లేదు.. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ మెరుగైన ఆటతీరు ప్రదర్శించడం లేదు. రోహిత్ శర్మ (Rohit Sharma), కుమార్ యాదవ్ (Surya Kumar Yadav), తిలక్ వర్మ (Tilak Verma), జస్ ప్రీత్ బుమ్రా (jasprit bumrah) వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు గత సీజన్లో గ్రూప్ దశను దాటలేకపోయింది. ఇక ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు మరో దారుణమైన రికార్డును తన పేరు మీద రాసుకుంది. వరుసగా 13వ ఓపెనింగ్ మ్యాచ్ లో ఓడిపోయి అత్యంత చెత్త ఘనతను తన పేరు మీద లిఖించుకుంది. అంతేకాదు చెన్నై తో 2021 నుంచి ఇప్పటివరకు తలపడిన ఏడు మ్యాచ్లలో ఆరింట్లో ఓడిపోయింది. ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది.. ముంబై జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అనితర సాధ్యమైన నేపథ్యాలు కలిగి ఉన్నారు. కానీ వారు జట్టు కోసం సరిగా ఆడలేక పోవడంతో ముంబై విజయాలు సాధించలేకపోతోంది. గత సీజన్లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించగా.. ఈసారి భారీ అంచనాలు ఉన్నప్పటికీ అంతగా ఆడలేక పోతోంది. తొలి మ్యాచ్ లోనే జట్టులో ఉన్న వైఫల్యం కళ్ళ ముందు కనిపించింది. మిగతా మ్యాచ్లలో దీన్ని సరిచేసుకుంటుందా.. లేక ఇలానే కొనసాగిస్తుందా అనేది చూడాల్సి ఉంది.
Also Read : చెన్నై బౌలర్ బాల్ ట్యాంపరింగ్..MI పై అందుకే గెలిచిందా?
రోహిత్ చెత్త రికార్డు
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ ను చెత్త రికార్డుతో మొదలుపెట్టాడు. ఆదివారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో చిన్న పరుగులకే అతడు అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఇన్ స్వింగర్ వేయగా.. మిడ్ వికెట్ దిశగా ప్లిక్ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీలింగ్ చేస్తున్న శివం దుబే ఆ క్యాచ్ ను అత్యంత సులభంగా అందుకున్నాడు. ఫలితంగా రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు డక్ అవుట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఆదివారం చెన్నై జట్టుపై 0 పరుగులకు అవుట్ అవ్వడం ద్వారా దినేష్ కార్తీక్, మాక్స్ వెల్ రికార్డులను రోహిత్ సమం చేశాడు. రోహిత్ ఇప్పటివరకు 18సార్లు డక్ అవుట్ అయ్యాడు. పీయూష్ చావ్లా, సునీల్ నరైన్ 16 సార్లు డకౌట్ తర్వతీ స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే 18 సీజన్లలో.. 18సార్లు డకౌట్ అయి రోహిత్ భలే రికార్డు సృష్టించాడని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. రోహిత్ అలా అవుట్ కావడంతో ముంబై జట్టు భారీగా స్కోర్ చేయలేకపోయింది. కేవలం 155 పరుగుల వరకే ఆగిపోయింది.. ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
Also Read : ఫస్ట్రేషన్ తగ్గలేదా రోహిత్తూ.. ఎందుకిలా ఆడుతున్నావ్?