spot_img
Homeటాప్ స్టోరీస్Extramarital Dating Apps In India 2026: వివాహేతర డేటింగ్ యాప్‌ల జోరు.. మన 'సంస్కృతి'...

Extramarital Dating Apps In India 2026: వివాహేతర డేటింగ్ యాప్‌ల జోరు.. మన ‘సంస్కృతి’ అప్‌డేట్ అవుతోంది!

Extramarital Dating Apps In India 2026: భారతదేశం అంటేనే “సంస్కృతి-సంప్రదాయాలకు నిలయం”. పురాణాల కాలం నుంచి ‘ఏడడుగుల బంధం’ అంటే ఏడు జన్మల బంధమని, ఒకరిని వదిలి ఇంకొకరిని చూస్తే పాపమని మనం నమ్ముతాం. కానీ, 2026 నాటికి మన డిజిటల్ పురాణం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు “ఏడడుగుల బంధం” కంటే “ఒక్క యాప్ లాగిన్” ముఖ్యమైపోయింది. వివాహేతర డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ (Gleeden) ఇప్పుడు మన భారతీయుల స్మార్ట్‌ఫోన్లలో ‘వాట్సాప్’ కంటే పవిత్రంగా వెలిగిపోతోంది!

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

బెంగళూరు: “ఐటీ” అంటే “ఇన్‌స్టంట్ టెంప్టేషన్”
దేశ రాజధాని ఢిల్లీ కాదు, టెక్ రాజధాని బెంగళూరే ఇప్పుడు ఈ ‘ఎక్స్‌ట్రా-కరిక్యులర్’ యాక్టివిటీస్‌లో ఫస్ట్ క్లాస్. ఐటీ ఉద్యోగాల్లో డేటాబేస్‌లని మేనేజ్ చేసినంత ఈజీగా, ఈ బెంగళూరు టెక్కీలు తమ వ్యక్తిగత రిలేషన్ షిప్ డేటాబేస్‌ను కూడా మేనేజ్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఏమైనా తక్కువ తిన్నదా? “హైదరాబాదీ బిర్యానీలో మసాలా ఎలాగో, మా జీవితాల్లో ఈ ఎక్స్‌ట్రా మసాలా అలా” అన్నట్టుగా 17 శాతం యూజర్లతో సెకండ్ ప్లేస్‌లో దూసుకుపోతోంది.

“మధ్యాహ్నపు మీటింగ్” మరియు “రాత్రి నిద్రలేమి”
ఈ యాప్ వినియోగదారులు చాలా క్రమశిక్షణ గలవారు. ఉదయం 12 నుండి 3 గంటల వరకు—అంటే ఆఫీసులో లంచ్ బ్రేక్ టైమ్‌లో—తమ లవ్‌లైఫ్ కోసం సమయం కేటాయిస్తారు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బాస్‌ను చూసి విసుగు చెందే బదులు, యాప్‌లో ‘కొత్త బాస్‌’లను వెతుక్కోవడం వాళ్లకి పెద్ద రిలీఫ్ అంట! ఇక రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ యాప్‌లో జరిగే చాటింగ్ చూస్తుంటే.. భారతీయులకి నిద్ర పట్టడం కంటే, వేరే వాళ్లతో మాట్లాడటమే ఎక్కువ ఇష్టమని అర్థమవుతోంది.

మహిళల రివల్యూషన్: “ఇప్పుడు మేమే టాప్!”
గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరిగిందట! అంటే, ఇంతకాలం “భర్త ఏది చెబితే అదే వేదం” అని ఫిక్సయిన మన భారతీయ నారి, ఇప్పుడు “యాప్ ఏది చూపిస్తే అదే ప్రేమ” అని డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా డాక్టర్లు, సీఏలు, ఎగ్జిక్యూటివ్‌లను వెతుక్కోవడం అంటే, ‘ప్రేమ’ కంటే ‘ప్రొఫెషనల్ అడ్వైస్’ తో పాటు కాస్తంత పర్సనల్ అడ్వెంచర్ కూడా కావాలనే కదా!

ఇది ప్రోగ్రెస్సా? లేక ‘డిజిటల్ సంసారం’లో కొత్త పోకడా?
ఒకప్పుడు ఇంటికి తెలియకుండా బయటకి వెళ్లాలంటే భయం ఉండేది. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఇంటి గడప దాటకుండానే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. “భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టమైనది” అని మనం కాలర్ ఎగరేసి చెప్పుకుంటాం, కానీ ఆ కుటుంబ వ్యవస్థలోని ‘గోడలకి’ ఇప్పుడు డిజిటల్ రంధ్రాలు పడుతున్నాయి.

మొత్తానికి, వివాహం అనే వ్యవస్థకు ఇప్పుడు ‘అప్‌డేటెడ్ వెర్షన్’ వచ్చేసింది. పేరుకు పెళ్లి అయినా, మనసుకి మాత్రం వై-ఫై సిగ్నల్ ఉన్న చోటల్లా కొత్త సంబంధాలు అల్లుకుపోతున్నాయి. ఇక నెక్స్ట్ ఏంటి? “వివాహేతర డేటింగ్ యాప్‌ల కోసం కూడా ప్రత్యేకంగా ప్యాకేజీలు, రివార్డులు” వస్తాయేమో! ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం.

“అన్నీ అనుకున్నట్టే జరుగుతుంటే, బ్రతుకులో కిక్కు ఏముంది?” అనుకునే ట్రెండ్ సెట్టర్లకి ఈ యాప్ ఒక వరం! మరి మీ ఫోన్లో ఇంకా ఈ యాప్ లేదా? ఏంటి.. మీరు ఇంకా పాత కాలపు సంప్రదాయాల్లోనే ఉండిపోయారా ఏంటి?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version