Homeక్రీడలుక్రికెట్‌Pakistan Overreaction Win vs Bangladesh: పాక్ టీ 20 వరల్డ్ కప్ గెలిచేసింది.. ...

Pakistan Overreaction Win vs Bangladesh: పాక్ టీ 20 వరల్డ్ కప్ గెలిచేసింది.. ఏందయ్యా ఇదీ

Pakistan Overreaction Win vs Bangladesh: రోజు పచ్చడి మెతుకులు తినేవాడికి.. బిర్యానీ దొరికితే ఎగిరి గంతులు వేస్తాడు. చిరిగిన బట్టలు వేసుకొని.. మాసిన దేహంతో తిరిగేవాడికి.. రంగుల చొక్కా.. జీన్స్ ప్యాంట్ వేస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినంత ఫీల్ అవుతాడు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి కూడా అలానే ఉంది.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

స్వదేశం వేదికగా గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు పాకిస్తాన్ కనీస ప్రదర్శన కూడా చేయలేకపోయింది. తీవ్రస్థాయిలో విమర్శలను మూటగట్టుకున్నది. భారత్ చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. ఇక ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు అత్యంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. టోర్నీకి ముందు తెగ గప్పాలు కొట్టింది. భారత జట్టును ఓడిస్తామని.. టి20 వరల్డ్ కప్ సాధిస్తామని వీర లెవెల్ లో ఎలివేషన్లు ఇచ్చుకుంది. కాని చివరికి ఓటమిని ఎదుర్కొని.. రిక్తహస్తాలతో ఇంటికి వెళ్లిపోయింది.

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్ల దూకుడు ముందు తలవంచింది.. అయితే రెండో వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 270+ పరుగులు చేసింది. ఆ తర్వాత సమర్థవంతంగా బౌలింగ్ వేసి బంగ్లాదేశ్ జట్టును కట్టడి చేసింది.

ఈ గెలుపుతో పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తాము బంగ్లాదేశ్ ను ఓడించామని.. మెరుగైన క్రికెట్ ఆడామని అంటున్నారు. ఇక పాకిస్తాన్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ మీద ఒక్క మ్యాచ్ గెలిచినందుకే టి20 వరల్డ్ కప్ సాధించినంత స్థాయిలో బిల్డ్అప్ ఇస్తున్నారు.. ఇక పాకిస్తాన్ అభిమానుల ఓవరాక్షన్ కు టీమ్ ఇండియా అభిమానులు ఎప్పటికప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. సో కాల్డ్ బంగ్లాదేశ్ మీద కాదని.. దమ్ముంటే ఇండియా మీద గెలిచి చూపించాలని సవాల్ విసిరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper
Exit mobile version