Vidudala Rajini : ఆంధ్రప్రదేశ్ లో( Andhra Pradesh) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన నేతలపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి విడదల రజిని మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు బయటపడ్డాయి. ఏసీబీ రంగంలోకి దిగింది. ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దీనిపై రజిని హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనపై కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనంటే ఆయనకు చాలా కోపం అని చెప్పుకొచ్చారు. దీనిపై తాజాగా స్పందించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో మాజీ మంత్రి వర్సెస్ ఎంపీ అన్నట్టు పరిస్థితి మారింది.
Also Read : తమిళనాడులోకి జనసేన ఎంట్రీ.. పవన్ సంచలనం!
* గతంలో ఒకే పార్టీలో..
2019లో చిలకలూరిపేట( chilakaluripeta) నుంచి గెలిచారు విడదల రజిని. మంత్రివర్గ విస్తరణలో రజనీకి ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మంత్రివర్గంలోకి తీసుకొని కీలక శాఖను అప్పగించారు. అప్పట్లో నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉండేవారు. అయితే అప్పట్లో పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని రజిని పై కేసు నమోదయింది. ఆమెతో పాటు ఓ ఐపీఎస్ అధికారి, ఆమె మరిది, ఈయనపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చారు మాజీ మంత్రి విడదల రజిని. ప్రస్తుతం టిడిపి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలపై ఫోన్ టాపింగ్ విమర్శలు చేశారు. ఇవి సంచలనంగా మారాయి. అయితే దీనిపై ఘాటుగా మాట్లాడారు శ్రీకృష్ణదేవరాయలు. ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు ఇతర అధికారుల వాంగ్మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు ఎంపీ. తాను కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారని.. తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని.. తమవారికి ఒక న్యాయం.. బయట వారికి మరో న్యాయం ఉండదని ఆయన గుర్తు చేశారు.
* భూ కేటాయింపులపై..
కాగా విజ్ఞాన్ విద్యాసంస్థలకు( Vigyan Educational Institute భూ కేటాయింపులపై కూడా రజిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రజని 40 సంవత్సరాలుగా విజ్ఞాన్ విద్యాసంస్థల నడుపుతున్నామని.. కానీ ఏపీలో ఏ ఒక్క ప్రాంతంలో తమకు భూమి కావాలని ప్రభుత్వానికి అడగలేదన్నారు. అమరావతిలో అనేక విద్యాసంస్థలు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. అయినా పాము మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేలం వేస్తే మిగతా వారితో పాటు పాల్గొని.. ఎక్కువ రేటు చెల్లించి మరి భూమి తీసుకున్నట్లు గుర్తు చేశారు. వేలానికి, కేటాయింపునకు మధ్య చాలా తేడా ఉందని.. దానిని గుర్తించుకోవాలని హేతువు పలికారు ఎంపీ లావు.
* మొన్న మాజీ మంత్రిపై..
అయితే మొన్నటికి మొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై( MP lovu Sri Krishna devarayalu) వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏదో ఒక వ్యూహం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే తనపై ఎవరు ఫిర్యాదు చేయలేదని.. కుట్ర పన్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు విడదల రజిని. అయితే ఏకంగా ఎంపీపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేయడం.. దానికి అదే స్థాయిలో ఎంపీ రిప్లై ఇవ్వడం చూస్తుంటే మున్ముందు.. పల్నాడు రాజకీయాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
Also Read : బెట్టింగ్ యాప్స్ వివాదం.. కేఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు.. సెలెబ్రిటీల అరెస్ట్‌కు డెడ్‌లైన్!