spot_img
Homeఎంటర్టైన్మెంట్Sukumar Ram Charan New Movie Music Director: సుకుమార్ - రామ్ చరణ్ సినిమాకి...

Sukumar Ram Charan New Movie Music Director: సుకుమార్ – రామ్ చరణ్ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడా..? ఎవరతను..?

Sukumar Ram Charan New Movie Music Director: సినిమా ఇండస్ట్రీలో సక్సెసులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ వెంటే ఇండస్ట్రీ మొత్తం పరిగెడుతుంది. పెద్ద ఫ్యామిలీ బ్యా గ్రౌండ్ ఉన్నా కూడా ఇండస్ట్రీని ఆకర్షించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను సంపాదించుకున్న వాళ్లను మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుంది… దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీప్రసాద్ గత 26 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చే సినిమాలేవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. మ్యూజిక్ విషయంలో ఆయన చాలా వరకు నిరాశ పరుస్తున్నాడనే ఉద్దేశంతోనే చాలామంది దర్శకులు అతన్ని పక్కన పెడుతున్నారు. అతని ప్లేస్ లో చాలామంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడంతో అందరు వాళ్ళ వైపే ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

ఇక పాన్ ఇండియా లో టాప్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న సుకుమార్ సైతం ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ సినిమా వరకు దేవీ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు… కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

మొత్తానికైతే సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కి బ్రేక్ పడనుందనే వార్తలైతే వస్తున్నాయి… దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో సుకుమార్ ఏ సంగీత దర్శకుడికి అవకాశాన్ని ఇస్తున్నాడు అనేది అందరిలో హాట్ టాపిక్ గా మారింది… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే సుకుమార్ అనిరుధ్ ను తన సినిమా కోసం తీసుకోవాలని చూస్తున్నారట.

రామ్ చరణ్ సైతం ఆయన పేరునే చెబుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫామ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతారు. ఫామ్ ని ఏమాత్రం కోల్పోయిన సక్సెస్ లు రాకపోయిన అప్డేట్ అవ్వకపోయిన కూడా ఇండస్ట్రీ అనేది వాళ్ళను పక్కన పెట్టేస్తుంది…ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ పరిస్థితి కూడా అలానే తయారయింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version