Homeక్రీడలుSports Anchor Vindhya Slams Pakistan: పోటీ పడలేక చేతులెత్తేశారు.. పాక్ ఇజ్జత్ తీసిన స్పోర్ట్స్...

Sports Anchor Vindhya Slams Pakistan: పోటీ పడలేక చేతులెత్తేశారు.. పాక్ ఇజ్జత్ తీసిన స్పోర్ట్స్ యాంకర్!

Sports Anchor Vindhya Slams Pakistan: క్రికెట్ ను రెగ్యులర్ గా చూసేవారికి యాంకర్ మెడపాటి వింధ్య విశాఖను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అంతకుమించిన మాటతీరుతో ఆమె ఆకట్టుకుంటుంది. ఆమె యాంకరింగ్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెను చాలామంది అనుసరిస్తుంటారు. స్పోర్ట్స్ యాంకరింగ్ లో వింధ్య సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. లెజెండ్రీ క్రికెటర్ల నుంచి మొదలు పెడితే వర్ధమాన ప్లేయర్ల వరకు ఎంతో మందితో ఆమె ఇంటర్వ్యూ […]

Sports Anchor Vindhya Slams Pakistan: క్రికెట్ ను రెగ్యులర్ గా చూసేవారికి యాంకర్ మెడపాటి వింధ్య విశాఖను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం.. అంతకుమించిన మాటతీరుతో ఆమె ఆకట్టుకుంటుంది. ఆమె యాంకరింగ్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమెను చాలామంది అనుసరిస్తుంటారు.

స్పోర్ట్స్ యాంకరింగ్ లో వింధ్య సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. లెజెండ్రీ క్రికెటర్ల నుంచి మొదలు పెడితే వర్ధమాన ప్లేయర్ల వరకు ఎంతో మందితో ఆమె ఇంటర్వ్యూ చేసింది. ఇక లైవ్ మ్యాచ్ సందర్భంగా ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆమె విశ్లేషణ చేస్తూ ఉంటుంది. విశ్లేషకులతో మాట్లాడుతూ ఉంటుంది. అందువల్లే ఆమె యాంకరింగ్ చాలామందికి ఇష్టం.

టి20 వరల్డ్ కప్ లో కొలంబ వేదికగా టీమిండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ రద్దు చేసుకోవడంతో వింధ్య మండిపడింది. పాకిస్తాన్ మ్యాచ్ బాయ్ కాట్ చేయడాన్నితప్పు పట్టింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ బంగారం లాంటి అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకుందని వ్యాఖ్యానించింది.

ఇండియాతో మ్యాచ్ అంటే పాకిస్తాన్ ప్లేయర్లు ఇబ్బంది పడిపోతున్నారని వింధ్య పేర్కొంది. సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. టీమిండియాలో ఆడదు కాబట్టి.. పాకిస్తాన్ జట్టుకు కొలంబో వేదికగా నాలుగు మ్యాచ్ లు ఆడే అవకాశం వచ్చిందని.. వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ జట్టు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమైందని వింధ్య వ్యాఖ్యానించింది. ఇటీవలి కాలంలో భారత జట్టుతో జరిగిన అన్ని మ్యాచ్ లలో పాకిస్తాన్ ఓడిపోయిందని.. అందువల్ల ఈ మ్యాచ్ కూడా ముందుగానే రద్దు చేసుకొని ఉంటుందని వింధ్య వ్యాఖ్యానించింది.. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా స్ఫూర్తికి మచ్చ తెచ్చే విధంగా ఉందని.. ఈ ప్రభావం భవిష్యత్తు కాలంలో పాకిస్తాన్ క్రికెట్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం లేకపోలేదని వింధ్య పేర్కొంది.

వింధ్య విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తోంది. సరైన సమయంలో సరైన తీరుగా వింధ్య వీడియోను బయటపెట్టారని.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్లేయర్లకు బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper