spot_img
Homeక్రీడలుIPL 2022 CSK: ఐపీఎల్ లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం ఈ రెండేనట!

IPL 2022 CSK: ఐపీఎల్ లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం ఈ రెండేనట!

IPL 2022 CSK: 5 సార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్.కే) ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2022 ఎడిషన్‌లో ఒక్క విజయం లేక వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే వారు తమ మొదటి నాలుగు గేమ్‌లలో ఓడిపోయారు. వారు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున చివరి స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ లోనే అత్యంత బలహీనంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా నిన్న రాత్రి చెన్నైను ఓడించి షాకిచ్చింది. ఇంకా ఖాతా తెరవకపోవడం చెన్నై అభిమానులకు షాకింగ్ గా మారింది.ధోని కెప్టెన్సీ వదిలేశాక.. రవీంద్ర జడేజా కొత్త కెప్టెన్ గా నియామకమైన తర్వాత చెన్నైకి ఇలా కొత్త సారథ్యంలో వరస ఓటములు షాక్ కు గురిచేస్తున్నాయి. సీఎస్.కే టోర్నీలోనే అన్ని జట్ల కంటే తక్కువ నెట్ రన్ రేట్‌ను కలిగి ఉంది. మూడు గేమ్‌లలో వారి ప్రదర్శనను విశ్లేషిస్తూ మాజీ సీఎస్.కే స్టార్.. భారత దిగ్గజం హర్భజన్ సింగ్ లోపాలను ఎత్తి చూపాడు. రవీంద్ర జడేజా నేతృత్వంలోని జట్టుకు ఆందోళన కలిగించే రెండు ముఖ్య అంశాలను పేర్కొన్నాడు.

గాయంతో సీఎస్కేకు దూరమైన ఆల్ రౌండర్ దీపక్ చాహర్ లేకపోవడం సీఎస్.కేని కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా తేల్చాడు.. చాహర్ కొత్త బంతితో సీఎస్.కే ఆయుధంగా ఉన్నాడు. ఐపీఎల్ గత మూడు సీజన్లలో 32 వికెట్లు తీసుకున్నాడు, ఇది ఐపీఎల్ లోని అందరి బౌలర్‌లోనూ అత్యధికంగా ఉంది. చాహర్ తప్పుకోవడంతో కొత్త బాల్ స్పెషలిస్ట్‌కు సరైన ప్రత్యామ్నాయం సీఎస్.కేకి లేదు. “వారికి ఒకటి కాదు, రెండు సమస్యలు ఉన్నాయి. మొదటి ఆరు ఓవర్లలో, బౌల్‌తో కొత్త బంతితో త్వరగా వికెట్లు ఇవ్వగల దీపక్ చాహర్ లాంటి వారు లేరు. పవర్‌ప్లే తర్వాత, 7 -15 ఓవర్ల మధ్య సీఎస్.కేకు వికెట్లు అందించగల స్పిన్నర్లు లేరు” అని హర్భజన్ సింగ్ చెన్నై ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు.

సీఎస్కే ఐపీఎల్-2022లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన బౌలింగ్ జట్టుగా ఉంది. మూడు గేమ్‌లలో కేవలం రెండు వికెట్లు తీయడంతోపాటు ఓవర్‌కు 9.44 పరుగుల చొప్పున ఆ టీం బౌలర్లు ఇచ్చారు. దాదాపు ప్రతి 4 బంతుల్లో ఒక బౌండరీని అందించడం చెన్నై ఓటమికి కారణంగా ఉంది..

ఇక ఐపీఎల్ లో గత సీజన్లలో దంచి కొట్టి చెన్నైని గెలిపించిన రుతురాజ్ గైక్వైడ్ ఫామ్ లో లేకపోవడం సీఎస్కేకి చాలా ఆందోళన కలిగించిందని హర్భజన్ అంచనావేశాడు. యువ ఓపెనర్ ఐపీఎల్ 2021లో ఆరెంజ్ క్యాప్ సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. గత సీజన్‌లో సీఎస్కే నాలుగో టైటిల్‌ను సాధించడానికి కీలకమైన బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. . అయితే, ఐపీఎల్ 2022లో అతను మూడు గేమ్‌ల్లో ఎదుర్కొన్న 12 బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. “రుతురాజ్ చాలా తొందరగా ఔట్ అవుతున్నాడు కాబట్టి బలమైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు చెన్నైకి ఉండడం లేవు. కాబట్టి జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిందని హర్భజన్ అంచనావేశాడు. అయినప్పటికీ, చెన్నై పునరాగమనం చేసి, ఆ తర్వాత విజయాన్ని కొనసాగిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ” అని హర్భజన్ అన్నాడు. .

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper