Homeక్రీడలుక్రికెట్‌Tilak Varma T20 World Cup Performance: శిష్యుడి ఆటపై గురువు గర్వం.. వరల్డ్ కప్...

Tilak Varma T20 World Cup Performance: శిష్యుడి ఆటపై గురువు గర్వం.. వరల్డ్ కప్ లో తిలక్ వర్మ మెరుపులు

Tilak Varma T20 World Cup Performance: అజహారుద్దీన్ తర్వాత టీమిండియాలో తనదైన ముద్ర వేసిన తెలుగు క్రికెట్ ప్లేయర్ లు కొంతమంది మాత్రమే ఉన్నారు. వివిఎస్ లక్ష్మణ్ లాంటివారు టెస్ట్ క్రికెట్లో తనదైన ట్రెండ్ సృష్టించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్ తన మార్క్ చూపించలేదు. ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్లేయర్లు జాతీయ జట్టులోకి ప్రవేశించినప్పటికీ.. తెలుగుదనాన్ని.. తెలుగు గడ్డకు గర్వాన్ని కలిగించే తీరును అందివ్వలేదు.

Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!

ఇప్పుడు ఆ లోటును తిలక్ వర్మ భర్తీ చేస్తున్నాడు. ప్రపంచ వేదిక మీద తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతూ.. విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా గురువారం రాత్రి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తిలక్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు, కరణ్ క్యాచ్ పట్టి.. మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పాడు. ఈ ప్రదర్శన ద్వారా తాను ఎంత విలువైన ఆటగాడినో తిలక్ వర్మ మరోసారి నిరూపించాడు.

గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ మీద వీర విహారం చేశాడు. పాకిస్తాన్ జట్టుకు ఆసియా కప్ ను దూరం చేసాడు. తద్వారా టీమిండియాలో బలమైన అడుగులు వేసి.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

తిలక్ పరుగుల ప్రవాహం వెనుక అతని గురువు సలాం ఉన్నాడు. తిలక్ వర్మలో ఉన్న ప్రతిభను ముందుగా గుర్తించింది సలాం. అతడి ప్రతిభకు మెరుగులు దిద్ది.. అద్భుతమైన ఆటగాడిగా తీర్చిదిద్దాడు. సలాం ఆటలో నేర్పిన మెలకువలను ఒంట పట్టించుకున్న తిలక్ వర్మ.. కీలక ఆటగాడిగా రూపాంతరం చెందాడు. తిలక్ వర్మ టీమ్ ఇండియా సాధిస్తున్న విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో సలాం ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తన శిష్యుడు ఆడుతున్న ప్రతి మ్యాచ్ ను సలాం దగ్గరుండి చూస్తున్నారు. అతడు కొడుతున్న ప్రతీ షాట్ ను ఆస్వాదిస్తున్నారు. సలాం ను తిలక్ వర్మ ప్రత్యేకంగా నిన్న ముంబై రప్పించారు. అక్కడ ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే సెమీఫైనల్ చూడాలని ఆహ్వానించారు. శిష్యుడి ప్రేమకు పొంగిపోయిన సలాం ముంబై వెళ్లి.. మ్యాచ్ మొత్తాన్ని వీక్షించారు. అంతేకాదు తిలక్ వర్మ ఆడుతున్న తీరు చూసి మైమరచిపోయారు. “అతడు తిరుగులేని ఆటగాడిగా మారి పోయాడు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైదానంలో వీర విహారం చేస్తున్నాడు. జట్టుకు మూల స్తంభం లాగా నిలుస్తున్నాడు. ఒక కోచ్ గా నాకు ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుందని” సలాం చెబుతున్నారు.

వాస్తవానికి తెలుగు గడ్డ నుంచి ఎంతమంది ప్లేయర్లు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించారు. అయితే వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియా కు సారధ్యం వహించే అవకాశం కొంతమంది ప్లేయర్లకు మాత్రమే వచ్చింది. వారిలో తమను తాము నిరూపించుకునే అవకాశం అజారుద్దీన్ తర్వాత తిలక్ వర్మకే దక్కింది. తిలక్ వర్మ ఇప్పుడు తన గురువు ముందు గొప్పగా కనిపిస్తున్నాడు. గురువుకే ఆశ్చర్యం కలిగించే విధంగా ఆడుతున్నాడు. తిలక్ వర్మ ఆట చూసి సలాం కన్నీరు పెడుతున్నారు. అవి ఆనందభాష్పాలు.. ఒక గురువుకు శిష్యుడు ఇంతకంటే గొప్ప గౌరవాన్ని ఏమిస్తాడు.. ఇప్పుడు ఆ ఆనందాన్ని సలాం కన్నుల నిండా.. గుండెల నిండా పొందుతున్నాడు!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular