BCCI: భారత క్రికెట్ లో రాజకీయాలు పెరిగిపోతుండడంతో పలువురు క్రికెటర్లకు అన్యాయం జరుగుతోంది. గతంలో కూడా సెలక్టర్లు రాజకీయాలు చేసి ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లను భారత జట్టులోకి రాకుండా చేశారు. తాజాగా అదే పనిని బీసీసీఐ చేస్తోందంటూ పలువురు విమర్శిస్తున్నారు. రాబోయే ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం అర్ధరాత్రి జట్టును హడావిడిగా ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను ఒకే ఒక వన్డే ఆడిన రుతురాజు గైక్వాడ్ కు అప్పగించారు. ఇదే ఇప్పుడు అనేక విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం పెట్టడం ద్వారా రాజకీయాలు చేశారంటూ సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) లో రాజకీయాల పెరిగిపోతున్నాయి అన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం పూర్తిగా విస్మరించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కెప్టెన్ గా ఉండాల్సిన వ్యక్తి కూడా అవకాశం కల్పించకపోవడం పట్ల కూడా విమర్శలు పెరుగుతున్నాయి. ఆసియా క్రీడలు – 2023 కోసం పురుషుల క్రికెట్ జట్టును ప్రకటించడం సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి చైనాలోని హాగ్జవ్ నగరంలో ఆసియా క్రీడల ఈవెంట్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 8వ తేదీన జరగనుంది. యువ బ్యాటర్ రుతురాజు గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ఆ ముగ్గురికి దక్కని చోటు.. కేరీర్ కు బ్రేక్ పడినట్టే..!
ఆసియా గేమ్స్ కు ఎంపిక చేసిన క్రికెట్ జట్టును పరిశీలిస్తే ఓ ముగ్గురు ఆటగాలను రాజకీయాలకు బలిపెట్టినట్లు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా అభిమానులు కూడా ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. వీరిలో పేసర్ హార్షల్ పటేల్, సీనియర్ ప్లేయర్లు శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ ఉన్నారు. గుజరాత్ కు చెందిన హర్షల్ పటేల్ ఇప్పటివరకు 25 టి20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడాడు. సోషల్ మీడియాలో చాలామంది వినియోగదారులు హాస్టల్ పటేల్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. హర్షల్ కంటే శివమ్ మావి ఎలా బాగున్నాడు అని పలువురు అడుగుతున్నారు. హర్షల్ తన అంతర్జాతీయ కెరీర్ లో 9.18 ఎకానమీ రేటుతో 29 వికెట్లు తీశాడు. ఇది కాకుండా అతను మరే ఇతర ఫార్మాట్లలో భారత్కు ప్రార్ధన ద్యం వహించలేకపోయాడు. అలాగే సీనియర్ ప్లేయర్ గా మూడు ఫార్మాట్లలో జట్టుకు అనేక విజయాలను అందించి పెట్టిన శిఖర్ ధావన్ ను కూడా ఆసియా గేమ్స్ కు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు. కనీసం బీ జట్టుకు కూడా సమర్ధుడిగా శిఖర్ ధావనను ఎంపిక చేయకపోవడం పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దావన్ బీసీసీఐ రాజకీయాల్లో ఇరుక్కుపోయాడు అంటూ పలువురు పేర్కొంటున్నారు. రాజకీయాలకు బలైన ఈ జాబితాలో ఉన్న మరో ఆటగాడు ఇషాంత్ శర్మ. అనుభవజ్ఞుడైన ఇషాంత్ శర్మ కు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు. ఇషాంత్ శర్మ తన కెరియర్లో అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. అతనికి ఇప్పుడు జట్టు నుంచి తప్పించారు. ఇప్పటి వరకు 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టి20 ఇంటర్నేషనల్ ఆడిన ఇషాంత్ శర్మ.. టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 115, టి20 లో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం కావడంతోపాటు.. రాజకీయాలే వీరి అవకాశాలను దెబ్బతీశాయి అంటూ పలువురు క్రికెట్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Web Title: Those three players are victims of bcci politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com