Dhurandhar 2 movie review by star director: గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కారణం ఏంటి అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారుతుంది. రణ్వీర్ వీర్ సింగ్ హీరోగా చేసిన ‘దురంధర్’ సినిమా మాత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దాదాపు 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘దురందర్ ది రివేంజ్’ పేరుతో ఒక సినిమా వస్తుంది. అయితే ఈ సినిమా మార్చ్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి తమ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసారు… ఈ సినిమాలో రన్వీర్ సింగ్ మరోసారి తన నట విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తుంది.
దర్శకుడు సైతం ఎక్కడ తగ్గకుండా ఫస్ట్ పార్ట్ కి మంచి ఈ సినిమాను తెరకెక్కించడని చెబుతున్నారు. ముఖ్యంగా హంజా అలీ మజరి (రణ్వీర్ సింగ్) తను అనుకున్న లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడా? లేదా అనేది ఈ సినిమా లో కీలకమైన అంశంగా తెలుస్తోంది… హంజా అలీ మజరీ (రణ్వీర్ సింగ్) పాకిస్తాన్ లోకి అడుగుపెట్టిన భారతీయ గూఢచారి ఏం చేశాడు…
Also Read: ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న టాప్ 3 డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?
తను చేసిన పని దేశానికి ఏ రకంగా ఉపయోగపడబోతోంది అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ కట్ గా చూపించబోతున్నారట. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో సీక్వల్ మీద ప్రేక్షకులకు మరింత అంచనాలైతే పెరిగాయి. కానీ దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కొంతవరకు కథ ను కూడా చేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి చూపించారట…ఆయనకి అంత ఒకే కానీ క్లైమాక్స్ నచ్చలేదని సినిమా యూనిట్ కి చెప్పారట…మరి ఆయన నిర్ణయాన్ని బట్టి క్లైమాక్స్ మార్చారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమాతో రన్వీర్ సింగ్ ఖాతాలో మరో సక్సెస్ దక్కుతుందా? బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి టాప్ పొజిషన్ కి చేరుకోవడానికి ఈ సినిమా ఏ రకంగా ఉపయోగపడుతుంది… గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేని బాలీవుడ్ ని ఒక్కసారిగా టాప్ పొజిషన్ కి తీసుకెళ్లే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి…