Rangasthalam Movie In Japan: #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా వచ్చిన రేంజ్ రీచ్ మరియు క్రేజ్ లో మిగిలిన హీరోలకు పావు శాతం కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా దేశం కానీ దేశం లో అక్కడి ప్రముఖుల చేత రాజమౌళి తర్వాత అత్యంత ప్రశంసలను దక్కించుకుంది రామ్ చరణ్ మాత్రమే. అందుకే ఆయనకీ ఇంస్టాగ్రామ్ లో కానీ, ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ మిగతా హీరోలకు రానంత రేంజ్ ఫాలోవర్స్ వచ్చారు. ఇదంతా #RRR చిత్రం తర్వాతే జరిగింది.
ఇకపోతే రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ వైడ్ గా ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పడానికి మరో ఉదాహరణ రీసెంట్ గా జపాన్ లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రమే. #RRR మూవీ జపాన్ లో చరిత్ర తిరగ రాయడం తో రామ్ చరణ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ‘రంగస్థలం’ చిత్రాన్ని రీసెంట్ గానే జపాన్ సబ్ టైటిల్స్ తో గ్రాండ్ గా విడుదల చేసారు. దీనికి అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
జులై 14 వ తేదీన జపాన్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా రెండున్నర మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి. #RRR మరియు సాహూ చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లను మొదటి రోజు రాబట్టిన సినిమా ఇదే. అంతే కాకుండా ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన ఇండియన్ సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించుకున్న చిత్రం కూడా ఇదే. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, ఈ సినిమా రెండవ రోజు , మూడవ రోజు కూడా జపాన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడు రోజుల్లో 8 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని, నాల్గవ రోజు హాలిడే అవ్వడం తో ఆరోజు కూడా ఈ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయని, అలా నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా 10 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.