Homeక్రీడలుYashasvi Jaiswal: కుటుంబానికి సర్ ప్రైజ్ ఇచ్చిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: కుటుంబానికి సర్ ప్రైజ్ ఇచ్చిన యశస్వి జైస్వాల్

Yashasvi Jaiswal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. తన కుటుంబం కోసం వేగంగా ఐదు బెడ్ రూమ్ లతో కూడిన ఇంటిని కొనుగోలు చేసి సభ్యులకు సర్ప్రైజ్ చేశాడు. వెస్టిండీస్ పర్యటనకి ఎంపికైన ఈ యువ బ్యాటర్ అరంగేట్రం మ్యాచ్ లోనే భారీ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రెండు కలలు కన్న యశస్వి జైస్వాల్.. ఆ రెండింటిని ఒకేసారి నెరవేర్చుకోవడం గమనార్హం. ఇందులో ఒకటి భారత జట్టులో చోటు దక్కించుకోవడం కాగా, రెండోది సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం. ఈ రెండింటిని ఒకేసారి జైస్వాల్ నెరవేర్చుకున్నాడు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలతో పెరిగాడు. అందుకు అనుగుణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరి కలను సాకారం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళిన భారత జట్టుకు ఎంపికయ్యాడు జైస్వాల్. అయితే చిన్నప్పటి నుంచి అద్దె ఇళ్లల్లో ఉంటున్న జైస్వాల్ కు మరో కల కూడా ఉంది. అదే సొంత ఇంటిలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆకాలను కూడా తాజాగా జైస్వాల్ నెరవేర్చుకున్నాడు. అందులో భాగంగానే ఐదు బెడ్ రూమ్లతో కూడిన ఇంటిని కొనుగోలు చేసి అందులోకి ఫ్యామిలీని మార్చాడు. దీంతో ఏకకాలంలో రెండు కలలను నెరవేర్చుకున్నట్లు అయింది. ముంబైలో అత్యంత విలాసవంతమైన ఈ ఐదు బెడ్ రూమ్ ల ఫ్లాట్ ను జైస్వాల్ కొనుగోలు చేసి కుటుంబానికి అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ జట్టులో చోటు కోసం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కుటుంబంతో కలిసి ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో చిన్నచిన్న ఇళ్లల్లో అద్దెకు ఉంటూ జీవనాన్ని సాగించాడు. జైస్వాల్ తండ్రి కుటుంబాన్ని పోషించేందుకు పానీపూరీలు అమ్మే వాడు. అయితే క్రికెట్ ప్రాక్టీస్ అనంతరం జైస్వాల్ కూడా తండ్రికి సహాయంగా అనేక సందర్భాల్లో పానీ పూరీలు విక్రయించాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు పానీపూరీల అమ్మినప్పటికీ ఏమాత్రం తాను బాధపడలేదని, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఈ తరహా సమస్యలకు అలవాటు పడినట్లు జైస్వాల్ అనేక సందర్భాల్లో పేర్కొన్నాడు. ఏది ఏమైనా జైస్వాల్ అంకితభావం, కఠోర శ్రమతో తన లక్ష్యాన్ని చేరుకొని కుటుంబాన్ని కూడా ఒక పెద్ద ఇంటికి మార్చాడు.

RELATED ARTICLES

Most Popular