Rohit Sharma: రోహిత్ ఎంట్రీతో వాంఖడెలో బాహుబలి సీన్ రిపీట్.. కన్నీటి పర్యంతమైన టీమిండియా కెప్టెన్

టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం బీసీసీఐ నిర్వహించిన సన్మాన వేడుకకు గురువారం భారత క్రికెటర్లు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో గురువారం సాయంత్రం ముంబై చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 12:08 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: బాహుబలి-1 సినిమా చూశారా.. అందులో ఇంటర్వెల్ కు ముందు విగ్రహాన్ని నిలబెట్టే ఘట్టం జరుగుతుంది. ఆ సమయంలో మాహిష్మతి రాజ్యంలో ఉండే వారంతా బాహుబలి.. బాహుబలి అంటూ నినాదాలు చేస్తారు. అది చూసే వాళ్లకు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది.. బాహుబలి -1 లో ఆ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటుంది.. సరిగ్గా అలాంటి దృశ్యమే గురువారం వాంఖడె మైదానంలో చోటుచేసుకుంది..

టి20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం బీసీసీఐ నిర్వహించిన సన్మాన వేడుకకు గురువారం భారత క్రికెటర్లు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో గురువారం సాయంత్రం ముంబై చేరుకున్న ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.. ముంబై నగరం మొత్తం అభిమానులతో జనసంద్రంగా మారింది. ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లు అభివాదం చేస్తుండగా.. అభిమానులు మైమరిచిపోయారు. టీమిండియా టీమిండియా అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

ఇక గురువారం రాత్రి జరిగిన సన్మాన కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. టీమిండియా ఆటగాళ్లు స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి వస్తుండగా అభిమానులు పులకరించిపోయారు. ముఖ్యంగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘన స్వాగతం పలికారు. రోహిత్ రోహిత్ అంటూ టీమిండియా కెప్టెన్ నామస్మరణ చేశారు. ఇది చూసేందుకు బాహుబలి -1 సినిమాను గుర్తు చేసింది..

తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానులను చూసి రోహిత్ ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీటి పర్యంతమవుతూ ట్రోఫీని ప్రదర్శించాడు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో కలిసి మైదానంలో ప్రదర్శన నిర్వహించాడు. జాతీయ జెండాను భుజాలపై మోస్తూ ఆకట్టుకున్నాడు.. ఈ దృశ్యాలను చూస్తూ అభిమానులు మై మరిచిపోయారు.