CM Chandrababu: అమరావతే కీలకం.. కుండబద్దలు కొట్టిన చంద్రబాబు

గతంలో ఎన్నడూ లేని ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలనుతీసుకుని వెళ్లి మరి కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Written By: Dharma, Updated On : July 5, 2024 12:11 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: రాజధాని విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పెడుతున్న ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర తెలుపుతోంది.కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. ఏపీలో ముఖ్యంగా అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన వాటికి ప్రాధాన్య ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. వాటి గురించి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు చంద్రబాబు. ముఖ్యంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు తో సహా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమనూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్రమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతికి అనుసంధానంగా ఉన్న విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో కూడా కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలనుతీసుకుని వెళ్లి మరి కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ, ఇతర అంశాలపై గడ్కరితో చర్చలు జరిపారు. అనంతపురం అమరావతి, హైదరాబాద్ అమరావతి ప్రాజెక్టులపై కీలక చర్చలు సాగాయి. వాణిజ్యమంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ తో సైతంపలు అంశాలపై చర్చించారు చంద్రబాబు. అమరావతిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకుని.. దానికి అవసరమైన అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి పలు అంశాలను చర్చించారు చంద్రబాబు.రేపు హైదరాబాద్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ తో చంద్రబాబు చర్చలు జరపనున్న సంగతి తెలిసిందే. అందుకే అంతకుముందే ఏపీకి ఆర్థిక సాయం, అమరావతి రాజధాని అంశాలను ప్రధాని ముందు ఉంచారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్లో అమరావతికి కేటాయింపులతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి అయితే చంద్రబాబు తన ముందున్న కర్తవ్యం కేవలం అమరావతి నిర్మాణం అన్నది కేంద్ర పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.