Ind Vs Nz Final 2026: సంజు శాంసన్ 89, అభిషేక్ శర్మ 52, ఇషాన్ కిషన్ 54.. ఇంతలా స్కోర్ చేసిన తర్వాత.. టీమిండియా ఈజీగా 300 పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే 15.1 ఓవర్లలోనే టీమిండియా 200 పరుగులు పూర్తిచేసుకుంది. అప్పటికి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్ నీశం అద్భుతంగా బౌలింగ్ వేసాడు. ఫలితంగా టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (54), సూర్య కుమార్ యాదవ్ (0), వీరికంటే ముందు సంజు శాంసన్ (89) ఔట్ కావడంతో టీమిండియా ఒక్కసారిగా ఇబ్బంది పడింది. 300 నుంచి పరుగులు చేస్తుంది అనుకుంటున్న క్రమంలో తడబడింది. ఒకానొక దశలో బౌండరీలు రావడం కష్టంగా మారింది. దీనికి తోడు హార్థిక్ పాండ్యా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ కావడం.. హార్దిక్ పాండ్యా 18 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా 300 స్కోర్ మార్కు చేరుకోలేకపోయింది. ఈ దశలో శివం దుబే 8 బంతులలో 26 పరుగులు చేశాడు. దీంతో టీమ్ ఇండియా స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టు మీద భారత్ 253 పరుగులు చేసింది.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా 250+ స్కోర్ చేయడం ఇది వరుసగా మూడవసారి. నాకౌట్ టోర్నీలో టీమిండియా జింబాబ్వే మీద ఆ తర్వాత ఇంగ్లాండ్ మీద.. ఇప్పుడు న్యూజిలాండ్ మీద 250 కి పైగా పరుగులు చేసింది. టీమిండియాలో సంజు శాంసన్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత శివం దుబే చివర్లో శివతాండవం చేశాడు. ఫలితంగా టీమిండియా 2 55 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫిలిప్స్, పొదుపుగా బౌలింగ్ చేశారు. నీశం మూడు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర, హెన్రీ తలా ఒక వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ కంటే ముందు శివం దుబే ను కనుక పంపించి ఉంటే టీమ్ ఇండియా స్కోర్ 300 ఈజీగా దాటేది. సూర్య కుమార్ యాదవ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో టీమిండియా 255 పరుగులు చేయగలిగింది. టీమిండియా 300 స్కోర్ చేయకపోవడానికి ఒక కారణం సూర్య కుమార్ యాదవ్ అయితే.. మరో కారణం హార్దిక్ పాండ్యా.