Homeఎంటర్టైన్మెంట్Gen Z Political Movements In South Asia: జెన్‌ జీ.. బంగ్లాదేశ్ లో ఓడింది.....

Gen Z Political Movements In South Asia: జెన్‌ జీ.. బంగ్లాదేశ్ లో ఓడింది.. నేపాల్ లో గెలిచింది.. కారణం ఇదే!

Gen Z Political Movements In South Asia: జెన్‌ జీ.. జెన్‌ జెడ్‌.. యువ తరంగం.. పేరు ఏదైనా అంతా ఒక్కటే. రెండేళ్లుగా ఏ ఉద్యమం జరిగినా.. అందులో ముందుగా వినిపించే పదం జెన్‌ జీ. పెరుగుతున్న నిరుద్యోగం.. పేదరికం… జనాభా.. పాలకుల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం, అవినీతి వెరసి ఉరకలేసే ఉడుకు రక్తం యువ తరంగంలా తిరగబడుతోంది. అన్యాయంపై పోరాడుతోంది. శ్రీలకంతో జెన్‌జీ ఉద్యమం మొదట తెరపైకి వచ్చింది. తర్వాత బంగ్లాదేశ్, గతేడాది నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమాలు జరిగాయి. కారణాలు వేరే అయినా పోరాటంలో ముందు ఉంది జెన్‌జీ. ఇక ఈ ఉద్యమాల తర్వాత జెన్‌జీ రాజకీయంగాను యాక్టివ్‌ అవుతోంది. జెన్‌జీ ఉద్యమాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ప్రభుత్వాలను కూల్చాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్, నేపాల్‌లో జెన్‌జీ పోటీ కూడా చేసింది. అయితే బంగ్లాదేశ్‌ ప్రజలు జెన్‌జీని ఆదరించలేదు. నేపాలీలు మాత్రం అధికారం కట్టబెట్టారు.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

షేక్‌ హసీనా ప్రభుత్వం కూల్చివేత..
2024లో హసీనా షేక్‌ ప్రభుత్వం కూలడానికి జెన్‌జీ (1997–2012 మధ్య జన్మించిన యువత) నిరసనాలు ముఖ్య కారణం. కొట్టా క్వోటా వ్యవస్థపై ప్రారంభమైన ఆందోళనలు అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనలపై విస్తరించాయి. ఇది ’జులై విప్లవం’గా పేరొందింది. ఈ ఉద్యమ నాయకులు స్టూడెంట్లు నహిద్‌ ఇస్లాం, హస్నాత్‌ అఫ్తాబ్, అబ్దుల్లా అఖ్తర్‌ నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (ఎన్‌ఎస్‌పీ) ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చశారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

ఓటమికి కారణాలు..
బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో జెన్‌జీ ఏర్పాటు చేసిన నేషనల్‌ సిటిజన్‌ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఉద్యమం తర్వాత కూడా అనేక హింసాత్మక ఘటనలు జరగడం ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. కొత్తగా పార్టీ పెట్టడంతో ప్రజల్లో నమ్మకం పెరగలేదు. మేనిఫెస్టో విధానాలు కూడా ప్రజలను నమ్మించేలా లేవు. పార్టీ స్థాపించినవారెవరికీ రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ పెట్టిన కొన్నాళ్లకే అంతర్గత విభేదాలు తలెత్తడం కూడా ఓటమికి కారణం. ఇక మరో ప్రధాన లోపం ఉద్యమంలో కనిపించిన ఉత్సాహం ఎన్నికల ప్రచారంలో కనిపించలేదు.

నేపాల్‌లో జెన్‌ జీ విప్లవం..
నేపాల్‌లో కేపీ శర్మ ఒలి ప్రభుత్వం 2024లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో యువత కోపం రగిలింది. నిషేధానికి ప్రధాన కారణం మంత్రులు, నేతల పిల్లలు ఈ టిక్‌టాక్‌లో ఖరీదైన దుస్తులు ధరించి రీల్స్‌ చేయడం. స్టార్‌ హోటళ్లలో గడపడం, విదేశీ టూర్లకు వెళ్లడం వంటి వీడియోలు ఉన్నాయి. వీటిపై అప్పటికే కోపంగా ఉన్న యువత టిక్‌టాక్‌ నిషేధంతో మరింత రగిలింది. ఇది అవినీతి, ఆర్థిక సమస్యలపై విస్తరించి ’జెన్‌జీæ రిభెలియన్‌’గా మారింది. ర్యాపర్‌ బాలెన్‌ షా(బాలేన్‌) ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

యువతలో ఉత్సాహం నింపిన షా..
నేపాల్‌ జెన్‌జీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బాలెన్‌ షా.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేలా యువతలో తన పాటలతో ఉత్సామం, ఉద్రేకం, కోపం నింపారు. పాటల రూపంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వీక్షణలు వచ్చాయి. ఇక షా 2022లో జరిగిన కాఠ్మండు మున్సిపల్‌ మేయర్‌గా స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు. రోడ్లు, వ్యర్థాల నిర్వహణలో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)లో చేరి, 2024 ఎన్నికల్లో 21 సీట్లు సాధించారు. యువత ఓటు బ్యాంక్‌ (40% ఓటర్లు 18–35 ఏళ్లు) కీలకం.

విజయ కారణాలు..
నేపాల్‌లో ఆర్‌ఎస్‌పీ విజయానికి కారణం హింస లేకుండా సోషల్‌ మీడియాను కళాత్మకంగా ఉపయోగించుకున్నారు. స్థానిక సమస్యలపై (ట్రాఫిక్, శుభ్రత) తక్షణ చర్యలు తీసుకున్నారు. మేయర్‌ పదవి ద్వారా రాజకీయ నైపుణ్యం పెంచుకున్నారు. దీంతో తాజాగా జరిగిన నేపాల్‌ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని ప్రజలు నమ్మారు. యువత అధికారంలోకి వస్తే దేశ భవిత మారుతుందని భావించారు. దీంతో ఆర్‌ఎస్‌పీకి పట్టం కట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular