Homeక్రీడలుక్రికెట్‌Team India A: ట్రోఫీ సంగతి దేవుడెరుగు.. కనీసం ఫైనల్ అయినా వెళ్తుందా..

Team India A: ట్రోఫీ సంగతి దేవుడెరుగు.. కనీసం ఫైనల్ అయినా వెళ్తుందా..

Team India A: పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. వారంతా ఇటీవలి ఐపిఎల్ లో అద్భుతాలు సృష్టించారు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టారు. అటువంటి టీమిండియా ఇప్పుడు ఊహించని స్థాయిలో ఓటములు ఎదుర్కొంటున్నది. గొప్ప గొప్ప ప్లేయర్లు చేతులెత్తిస్తున్నారు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్లు కాపాడుకుంటేనే గొప్ప అన్నట్టుగా ఆడుతున్నారు. శ్రీలంకలో జరుగుతున్న ట్రయాంగిల్ సిరీస్లో తిలక్ సేన ఏమాత్రం […]

Team India A: పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. వారంతా ఇటీవలి ఐపిఎల్ లో అద్భుతాలు సృష్టించారు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేసి అదరగొట్టారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టారు. అటువంటి టీమిండియా ఇప్పుడు ఊహించని స్థాయిలో ఓటములు ఎదుర్కొంటున్నది. గొప్ప గొప్ప ప్లేయర్లు చేతులెత్తిస్తున్నారు. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్లు కాపాడుకుంటేనే గొప్ప అన్నట్టుగా ఆడుతున్నారు.

శ్రీలంకలో జరుగుతున్న ట్రయాంగిల్ సిరీస్లో తిలక్ సేన ఏమాత్రం గొప్ప ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కనీసం ఫైనల్ దాకా అయినా వెళ్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

భారత జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల శ్రీలంక జట్టు జరిగిన మ్యాచ్లో కేవలం టీమిండియా నాలుగు పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టినప్పటికీ.. బౌలర్ లు విఫలమయ్యారు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆటగాళ్లు మొత్తం విఫలం కావడంతో.. మళ్లీ ఓటమి ఎదురైంది. సూపర్ ఓవర్ దాక మ్యాచ్ సాగినప్పటికీ టీమిండియా విజయం అందుకోలేకపోయింది.

ప్రస్తుతం టీమిండియా ఫైనల్ దాకా వెళ్లాలి అంటే కచ్చితంగా బుధవారం నాటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై కచ్చితంగా గెలవాలి . ఆ విజయం కూడా భారీ అంతరంతో ఉండాలి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో గనుక టీమిండియా ఓడిపోతే కచ్చితంగా ఇంటికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్లో శ్రీలంక మీద భారీ తేడాతో గెలిస్తే సమీకరణాలు ఇంకా దారుణంగా మారిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ మీద టీం ఇండియా.. శ్రీలంక మీద ఆఫ్గనిస్తాన్ విజయం సాధిస్తే అప్పుడు మూడు జట్ల ఖాతాలో నాలుగు చొప్పున పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్లు మాత్రమే ఫైనల్ దాకా వెళ్తాయి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ చివరి రెండు మ్యాచ్ లలో కనుక ఓడిపోతే భారత్.. శ్రీలంక ఫైనల్ లో పోటీ పడతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper