T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ చెత్త రికార్డు

T20 World Cup 2024: హోప్ 26, పావెల్ 25 పరుగులతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, 218 రన్స్ చేసింది

Written By: Anabothula Bhaskar, Updated On : June 18, 2024 1:00 pm

west-indies-vs-afghanistan-highlights

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో అసాధారణ ఆటతీరుతో సూపర్ -8 కు దూసుకెళ్లిన ఆఫ్ఘనిస్తాన్.. తన చివరి మ్యాచ్లో మాత్రం దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. వెస్టిండీస్ చేతిలో 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. పూరన్ 98 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చార్లెస్ 43 పరుగులు చేశాడు. హోప్ 26, పావెల్ 25 పరుగులతో అదరగొట్టారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, 218 రన్స్ చేసింది

219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలర్లలో మెక్కాయ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. గుడాకేష్ మోతి, హోస్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రస్సెల్, జోసెఫ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో జద్రాన్ 38, ఓమర్జాయ్ 23, రషీద్ ఖాన్ 18, కరీం జనత్ 14 పరుగులు చేశారు.. ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయ్యారు. మిగతా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 114 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ ఓటమి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకుంది. టి20 లలో ఆఫ్ఘనిస్తాన్ కు ఇది రెండవ అతిపెద్ద ఓటమి.

Also Read: West Indies vs Afghanistan : వెస్టిండీస్ సరికొత్త రికార్డు..

2012లో కొలంబో వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో తలపడిన ఆఫ్ఘనిస్తాన్.. 116 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2024 t20 వరల్డ్ కప్ లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్ జట్టుతో పోటీపడిన ఆఫ్ఘనిస్తాన్ 104 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. దుబాయ్ వేదికగా 2021లో భారత్ తో జరిగిన మ్యాచ్లో. ఆఫ్ఘనిస్తాన్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 2024లో దంబుల్లా వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 72 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పరాజయం పాలైంది.

Also Read: WI vs AFG : వెస్టిండీస్ దెబ్బకు ఆప్ఘాన్ విలవిల.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఓటమి..

ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలో వెస్టిండీస్ జట్టుతో మినహా ఆడిన అన్ని మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్తాన్ అసాధారణ ఆట తీరు దర్శించింది. బలమైన న్యూజిలాండ్ ను, బలహీనమైన ఉగాండా, పపువా న్యూ గినియా జట్లను 100 పరుగుల లోపే కట్టడి చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 114 పరుగులకే కుప్పకూలడం విశేషం.