Viral Video : అప్పట్లో ఓ గద్ద పసికందును తన్నుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తర్వాత అది రియల్ కాదని గ్రాఫిక్స్ అని తెలిసింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఈసారి గద్ద కాదు.. గాలి పటం చిన్నారిని ఎగరేసుకుపోయింది. ఇది రియల్ వీడియోనే అంటున్నారు.
వీడియో చూస్తే షాకే..
గద్ద వీడియో తరహాలో ఈ వీడియో కూడా గ్రాఫ్ అనుకుంటే పొరపాటే. ఈ వీడియో ఎవరు చూసినా షాక్ అవుతారు. మళ్లీ మళ్లీ చూస్తారు. అందులో ఉత్కంఠరేసే అంశం అలా ఉంది. పెద్ద గాలిపటం.. మూడేళ్ల చిన్నారిని గాల్లోకి తనతోపాటు లేపుకుని వెళ్లిపోయింది. అందనంత ఎత్తుకి చేరుకుంది. ఎక్స్‌లో @ InsaneRealitys అకౌంట్ నుంచి ఈ వీడియోని పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
కైట్ ఫెస్టివల్‌లో భాగంగా..
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియోను చూస్తే మాత్రం అక్కడే ఏదో కైట్ ఫెస్టివల్ జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ కొంతమంది పోటీదారులు.. ఓ భారీ గాలిపటాన్ని ఎగరేశారు. ఆ గాలి పటం చివరి భాగం.. ఓ మూడేళ్ల చిన్నారిని చుట్టుకొని ఉందని వాళ్లు గ్రహించలేదు. అదే సమయంలో భారీగా ఈదురు గాలి రావడంతో.. ఆ గాలి పటంగాల్లోకి ఎగిరింది. దాంతో.. ఆ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోయింది.
షాక్ అయిన స్థానికులు..
గాలిలోకి ఎగురుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. చిన్నారి తల్లిదండ్రులు.. కేకలు పెట్టారు. ఐతే.. లక్ ఏటంటే పాప గాలిపటాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో ఆమె కిందపడలేదు. దీంతో పాపను పైకి తీసుకెళ్లిన గాలే.. మళ్లీ మెల్లిగా కిందకు దింపింది. పాపకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘బోయింగ్ కంటే సేఫ్‌గా దిగింది’ అని ఒకరు కామెంట్ చెయ్యగా.. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కొందరు మొబైల్‌లో వీడియో తీస్తుండటాన్ని తప్పుపడుతూ.. ఓ యూజర్.. ‘మనం ఇలాంటి రోజుల్లో జీవిస్తున్నాం’ అని కామెంట్ చేశారు.
3-year-old girl gets caught in kite and flies into the sky pic.twitter.com/Zx73BtlC6e
— Insane Reality Leaks (@InsaneRealitys) June 17, 2024