Stampede Complaint Virat Kohli : కబ్బన్ పార్క్ పోలీసులకు అందిన ఫిర్యాదు కంటే ముందు ఒకరోజు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ ఒక యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. కరకంగా అది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మీడియాలో కూడా దాని సంబంధించిన కథనాలు ప్రముఖంగా ప్రసారం అయ్యాయి. దీనికి తోడు బుధవారం బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన విరాట్ కోహ్లీ.. విమానాశ్రయంలో విచారంగా కనిపించాడు. అనుష్క శర్మ కూడా ముభావంగా దర్శనమిచ్చింది. దీంతో ఏదో తప్పు చేశామనే అపరాధ భావం విరాట్ కోహ్లీ లో కనిపించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ జరిగిన ఘటనపై ఇంతవరకు నోరు విప్పలేదు. మరోవైపు టీమ్ ఇండియా కోచింగ్ గౌతమ్ గంభీర్ ఇలాంటి విజయ యాత్రలు అవసరమా అంటూ పరోక్షంగా కోహ్లీని ఉద్దేశించి విమర్శించాడు. ఒకవేళ తను గనుక ఆ స్థానంలో ఉండి ఉంటే విజయ యాత్రకు ఒప్పుకునే వాడిని కాదని గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చాడు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో బెంగళూరు జట్టు, కర్ణాటక క్రికెట్ సంఘం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నది విరాట్ కావడం గమనార్హం.
Also Read : నిన్నేమో అరెస్ట్.. ఈరోజు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు.. కోహ్లీని ఇలా తగులుకుంటున్నారేంటి?
కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందులో నేపథ్యంలో విరాట్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే కన్నడ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్.. ఈ ఈవెంట్ నిర్వహించిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సంబంధించిన ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ అరెస్టు అక్రమం అంటూ వారు కర్ణాటక అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ కేసు కు సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉంది. ఇక విరాట్ కోహ్లీపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారా అనే చర్చ కూడా మొదలైంది. అయితే దీనిపై పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అయితే ఇప్పటికే కన్నడ ఐపీఎల్ జట్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే వారిని విచారిస్తారని తెలుస్తోంది..” విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఘటనలో అతడికి ప్రత్యక్ష ప్రమేయం లేదు. ట్రోఫీ గెలిచిన తర్వాత విజయ్ యాత్ర చేద్దామని విరాట్ కోహ్లీ అన్నట్టు పోలీసులు ఆధారాలు చూపిస్తున్నారు. అయితే ఇవి కోర్టులో బలంగా నిలబడతాయా? ఆ వ్యాఖ్యలను కోర్టు స్పష్టమైన ఆధారంగా తీసుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభిస్తేనే కొమిలిపై పోలీసులకు తదుపరి చర్యలు తీసుకొని అవకాశముంటుంది. మనదేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ఆటగాడు కాబట్టి కోహ్లీ విషయంలో కర్ణాటక పోలీసులు ఆదేశాల చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అని” న్యాయ నిపుణులు అంటున్నారు.