Complaint Against Virat Kohli: ఈ వ్యవహారం కంటే ముందుగానే నిన్నంతా సోషల్ మీడియాలో బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి విపరీతమైన చర్చ నడిచింది. తొక్కిసలాట ఘటనకు అతడు కూడా బాధ్యుడని.. అతడు ఏకంగా విజయ యాత్ర నిర్వహిద్దామని.. మ్యాచ్ గెలిచిన వెంటనే చెప్పాడని.. దీంతో అతని అభిమానులు భారీగా వచ్చారని.. అందువల్లే ఆ స్థాయిలో తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు మోపిన అభియోగాలలో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు జట్టు మార్కెటింగ్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ఘటనలో అరెస్టులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.. ఇక ఇప్పటికే కన్నడ క్రికెట్ సంఘానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు పరారీలో ఉన్నారు. అయితే వారు కూడా ఈ ఘటన జరగడానికి బాధ్యులని కన్నడ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఈవెంట్ సంస్థ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇక నిన్న మొత్తం సోషల్ మీడియాలో కోహ్లీని కటకటాల వెనకకు పంపించాలని తీవ్రమైన చర్చ నడిచింది. అతడి అభిమానులు భారీగానే స్పందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఈరోజు ఏకంగా కర్ణాటక రాష్ట్రంలోని రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఏకంగా విరాట్ కోహ్లీ మీద కంప్లైంట్ ఇచ్చారు.. ” ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో అలజడి చోటుచేసుకుంది. 11 మంది అకారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒక నవ వధువు కూడా ఉంది. ఇంతటి దారుణం జరగడం కలచివేస్తోంది. ఈ దారుణానికి విరాట్ కోహ్లీ కూడా కారణం. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని” వెంకటేష్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే కన్నడ ఐపీఎల్ జట్టుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంకటేష్ ద్వారా ఫిర్యాదు అందిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందా? కాదా? అనే విషయంపై పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు విరాట్ కోహ్లీకి మద్దతుగా అతని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.. అతడిని అరెస్టు చేయడం సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ చాలామంది విరాట్ కోహ్లీ, ఇతర కన్నడ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. వారి తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కన్నడ ఆటగాళ్లు ఒక్కసారిగా డిఫెన్స్ లో పడిపోయారు. వారికి ట్రోఫీ గెలిచిన ఆనందం కూడా లేకుండా పోయింది..