Sri Lanka Vs Australia: టి20 వరల్డ్ కప్ లో భారత ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదవుతున్నాయి. ఆదివారం కొలంబోలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫలితంగా జియో హాట్ స్టార్ కు ప్రకటనల రూపంలో భారీగా ఆదాయం వచ్చింది. అయితే మిగతా మ్యాచ్లు మాత్రం అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. జియో హాట్ స్టార్ అంచనా వేసినట్టుగా వ్యూస్ సొంతం కావడం లేదు.
జియో హాట్ స్టార్ అంచనాలకు అందకుండా మంగళవారం నాడు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. శ్రీలంక ఎదుట 182 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఫలితంగా శ్రీలంక జట్టు సూపర్ 8 దశకు చేరుకుంది.
ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో జియో హాట్ స్టార్ పండగ చేసుకుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా జడ్ల మధ్య జరిగిన మ్యాచును రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వీక్షించారు. మొత్తం పది కోట్ల మంది ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఫలితంగా ఈ టోర్నీలో 100 మిలియన్ల వియర్ షిప్ సాధించిన తొలి నాన్ ఇండియన్ మ్యాచ్ గా నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. చేదించింది. టి20 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టుకు ఇదే అత్యధిక చేదన. శ్రీలంక జట్టులో నిస్సాంక సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించాడు .
శ్రీలంక జట్టు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించడంతో చాలామంది ప్రేక్షకులు ఫోన్ లకు అతుక్కుపోయారు. తమ జట్టు ఆటగాళ్లు కాకపోయినప్పటికీ.. శ్రీలంక ప్లేయర్లు అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో.. ప్రేక్షకులు ఆనందానికి గురయ్యారు. శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ ను వీక్షించిన వారిలో టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీలంక జట్టు సూపర్ 8 దశకు వెళ్లిపోవడంతో ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంక జట్టు ఈ స్థాయిలో పోరాట పటిమను ప్రదర్శించడం పట్ల అభిమానులు ఎగిరి గంతులు వేస్తున్నారు. శ్రీలంక జట్టు ఇలానే వరుస విజయాలు సాధించి.. విజేతగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.