Homeక్రీడలుVaibhav Suryavanshi : బుడ్డోడా.. రారా అంటూ నినాదాలు చేసిన వారే.. పో పో అంటూ...

Vaibhav Suryavanshi : బుడ్డోడా.. రారా అంటూ నినాదాలు చేసిన వారే.. పో పో అంటూ పంపించారు.. పాపం వైభవ్..

Vaibhav Suryavanshi : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటారు. కానీ ఇవి టీమిండియా యంగ్ సెన్సేషన్ సూర్య వంశీ కి అంతగా వంటబట్టినట్లు లేవు. పైగా అతడికి క్రికెట్లో నిదానంగా ఆడాలని.. సావధానంగా పరుగులు తీయాలని అర్థమైనట్టు లేదు. అందువల్లే కొంప మునిగిపోయింది. రారా అంటూ నినాదాలు చేసిన వారే పో పో అంటూ పంపించారు. వైభవ్ ఆట ఎలా ఉంటుంది..అతడి ఎటాకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన […]

Vaibhav Suryavanshi : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటారు. కానీ ఇవి టీమిండియా యంగ్ సెన్సేషన్ సూర్య వంశీ కి అంతగా వంటబట్టినట్లు లేవు. పైగా అతడికి క్రికెట్లో నిదానంగా ఆడాలని.. సావధానంగా పరుగులు తీయాలని అర్థమైనట్టు లేదు. అందువల్లే కొంప మునిగిపోయింది. రారా అంటూ నినాదాలు చేసిన వారే పో పో అంటూ పంపించారు.

వైభవ్ ఆట ఎలా ఉంటుంది..అతడి ఎటాకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే అతడు విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ లో అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. గొప్ప గొప్ప బౌలింగ్ మొత్తాన్ని చీల్చి పడేశాడు. ఫోర్ల వర్షం కురిపించాడు. సిక్సర్ల సునామి సృష్టించాడు. బీభత్సం అంటే ఎలా ఉంటుందో.. అలా బ్యాటింగ్ చేశాడు.

అతని ఆట తీరు చూసి ముచ్చటపడిన మేనేజ్మెంట్ ఐరిష్ సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే ఆ సిరీస్లో అతడికి ఆడే అవకాశం లభించలేదు. దీంతో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అతడికి చోటు కల్పించాలని ఏకంగా ఉద్యమం నడిచింది. చివరికి మేనేజ్మెంట్ అతనికి అవకాశం కల్పించింది. ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా అతడు టీమిండియాలోకి ప్రవేశించాడు. అంతర్జాతీయ మ్యాచులు ఆట మొదలు పెట్టాడు. కానీ ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయాడు. గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. ఫలితంగా ఐదవ టి20 మ్యాచ్ కి స్థానమే కోల్పోయాడు.

సూర్య వంశీ గురించి మొదట గొప్పగా చెప్పినవారు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. అతడి ఆట తీరు చూసి నిర్వేదం వ్యక్తంచేశారు. ఐపీఎల్ లో అదరగొట్టిన అతడు ఇంగ్లాండ్ సిరీస్ లో తేలిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ప్రతీబంతిని గట్టిగా కొట్టాలనే అతడి తాపత్రయం చూసి మండిపడ్డారు. అతడి ఆటతీరు మూడు మ్యాచ్ లలో ఒకేతీరుగా ఉండటంతో మేనేజ్మెంట్ ఐదో మ్యాచ్ కు దూరం పెట్టింది. ఈ దూరం ఇలానే సాగుతుందా.. తదుపరి మ్యాచ్ లలో కూడా కొనసాగుతుందా.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper