Homeక్రీడలుక్రికెట్‌Sri Lanka Vs Australia T20 World Cup 2026: జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.. శ్రీలంక...

Sri Lanka Vs Australia T20 World Cup 2026: జింబాబ్వే చేతిలో ఓడిపోయింది.. శ్రీలంక ముందు తలవంచింది.. ఆస్ట్రేలియా అలా అవడానికి ఇదే కారణమా?

Sri Lanka Vs Australia T20 World Cup 2026: ఆస్ట్రేలియా.. ఈ పేరు వినిపిస్తే చాలు క్రికెట్ ఆడే అన్ని జట్లలో ఒక్కసారిగా భయం ఆవరిస్తుంది. ఏం చేయాలో తెలియక ఆస్ట్రేలియా ముందు తలవంచడమే ఆ జట్ల వంతు అవుతుంది. ఇలా దశాబ్దాలపాటు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం శాసించింది. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చూపించింది. ఇంతటి స్థాయి ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు దారుణమైన ఓటములను ఎదుర్కొంటున్నది.

2023లో ఆస్ట్రేలియా జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. అదే ఏడాదిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గదను కూడా అందుకుంది. తద్వారా క్రికెట్లో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అటువంటి ఆస్ట్రేలియా జట్టు 2025 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన టి20 వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొంది.

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమిని మర్చిపోకముందే శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా పరాజయం పాలయింది. బలమైన బ్యాటింగ్ లైనప్.. భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఇలా ఓడిపోవడం అభిమానులకు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు.

ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం బౌలింగ్ లోపం. ప్రస్తుతం ఈ జట్టులో కమిన్స్ లేడు. ప్రమాదకరమైన హెజిల్ వుడ్ లేడు.. వీరిద్దరూ లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యర్థి జట్లు పండగ చేసుకుంటున్నాయి.

జింబాబ్వే లాంటి జట్టు కూడా ఆస్ట్రేలియా మీద గెలిచిందంటే దానికి ప్రధాన కారణం బౌలింగ్ లోపమే. సరైన బౌలర్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి క్వార్టర్ ఫైనల్.. ఫైనల్ మ్యాచ్ లలోకి ఆస్ట్రేలియా ప్రవేశిస్తే ఫలితం వేరే విధంగా ఉంటుంది. 2023 వన్డే వరల్డ్ కప్ దానిని నిరూపించింది.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఆస్ట్రేలియాకు అలాంటి అవకాశం కలిగేలా లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో నాడు స్టార్క్, కమిన్స్, హెజిల్ వుడ్ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు వారు లేకపోవడంతో.. జట్టు బౌలింగ్ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బార్ట్ లెట్, స్టోయి నీస్, ఎల్లిస్, కూపర్ కన్నోలీ, జంపా వంటి వారు ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. అందువల్లే జింబాబ్వే లాంటి జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇప్పుడు శ్రీలంక చేతిలో కూడా ఓడిపోయి టి20 వరల్డ్ కప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించే దుస్థితికి దిగజారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular