SRH vs GT : ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) తల పడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 152 రన్స్ స్కోర్ చేసింది. వాస్తవానికి ఈ మైదానంపై హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. ఇదే మైదానంపై గతంలో అనేకసార్లు 200కు మించి పరుగులు చేసింది. ఈ సీజన్లో ఇదే మైదానంపై రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హైదరాబాద్ 286 పరుగులు చేసింది . ఈ సీజన్లో ఇప్పటివరకు అది హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతోంది. మరే జట్టుకు కూడా ఆ ఘనతను బ్రేక్ చేయడానికి సాధ్యం కావడం లేదు. అయితే అలాంటి మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఆదివారం నాడు జరిగిన మ్యాచ్లో అదే కనిపించింది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి (31) చేసిన పరుగులే హైయెస్ట్ స్కోర్ అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ శర్మ (18), హెడ్ (8), ఇషాన్ కిషన్ (17), క్లాసెన్(27), అనికేత్ వర్మ (18), కామిందు మెండిస్ (1), కమిన్స్(22*), సమర్ జీత్ సింగ్ (0) ఇలా సాగింది హైదరాబాద్ ఆటగాళ్ల బ్యాటింగ్ తీరు.. ఏ ఒక్కరు కూడా 40 పరుగుల వరకు స్కోర్ చేయలేదంటే బ్యాటర్లకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించిందో అర్థం చేసుకోవచ్చు..
Also Read : RCB పై కోపం సహజం.. సన్ రైజర్స్ ఏం చేసింది సిరాజ్ బ్రో?!
ఎందుకిలా అయింది
ఉప్పల్ పిచ్ అనగానే బ్యాటర్లు పండగ చేసుకుంటారు. బౌలర్లు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. ఇదే మైదానంపై హైదరాబాద్ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గొప్ప గొప్ప జట్లను కూడా ఓడించారు. బౌలర్లకు సింహ స్వప్నం లాగా మిగిలారు.. అయితే అలాంటి ఈ మైదానంపై హైదరాబాద్ జట్టు పరుగులు చేయలేక ఇబ్బంది పడడాన్ని సన్ రైజర్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇదే మైదానంపై గుజరాత్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 4/17, ప్రసిద్ధ్ కృష్ణ 2/25, సాయి కిషోర్ 2/24 సత్తా చాటారు. వీరు వేసిన బంతులు బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కొన్ని బంతులు అయితే వికెట్లను నేలకూల్చాయి. అయితే ఇదే సమయంలో ఎంతో అనుభవజ్ఞుడైన ఇశాంత్ శర్మ తేలిపోయాడు. నాలుగు ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చాడు.. ఇతడి బౌలింగ్లో హైదరాబాద్ ఆటగాళ్లు కాస్త స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు.. అయితే మిగతా బౌలర్లకు దొరికిన పట్టు.. ఇతడికి ఎందుకు సాధ్యం కాలేదనేది అర్థం కాకుండా ఉంది. ఇక గుజరాత్ ఆటగాళ్లలో ఓపెనర్ సాయి సుదర్శన్(5), వన్ డౌన్ బ్యాటర్ బట్లర్ (0) త్వరగానే అవుట్ అయ్యారు.. కానీ అదే గిల్(21*), వాషింగ్టన్ సుందర్ (29*) మాత్రం దూకుడు కొనసాగిస్తున్నారు..
Also Read : సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!