Tata Motors : భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటైన టాటా మోటార్స్ ఏప్రిల్ 2025 నుండి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే, టాటా 2024లో తయారైన కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వీటిలో కొన్ని మోడళ్లు ఇంకా అమ్ముడుపోలేదు. అందుకే కంపెనీ ఈ వాహనాలపై డిస్కౌంట్ ఇచ్చి స్టాక్‌ను త్వరగా క్లియర్ చేయాలని చూస్తోంది. టాటాకు చెందిన ఒక కారుపై అయితే ఏకంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.
ఏప్రిల్ 2025 నెలలో టాటా మోటార్స్ అందిస్తున్న డిస్కౌంట్లలో అత్యధికంగా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇయర్ 2024 వెర్షన్‌పై ఉంది. ఈ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ (నాన్ రేసర్) వేరియంట్‌లపై గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక ఆల్ట్రోజ్ రేసర్ మోడల్‌పై అయితే గరిష్టంగా రూ.1.35 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ సీఎన్‌జీ మోడల్ ఇయర్ 2025 వెర్షన్‌లపై టాటా రూ.45,000 తగ్గింపును అందిస్తోంది.
Also Read : పెట్రోల్ ఖర్చులకు చెక్ పెట్టండి! టాటా టియాగో ఈవీపై బంపర్ ఆఫర్!
కారు ధర ఎంతంటే
ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఫీచర్ల జాబితా, మంచి ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా చాలా స్థిరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. దీని స్టీరింగ్ తేలికగా ఉండటంతో ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ బేస్ మోడల్ ధర రూ. 7.57 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 12.83 లక్షల వరకు (ఆన్-రోడ్ ఢిల్లీ) ఉంటుంది.
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తున్న కారు
టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP నుండి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆఫ్టర్-ఇంపాక్ట్ బ్రేకింగ్, రోల్-ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్‌తో నిండి ఉంది. ఇందులో స్పీడ్-సెన్సింగ్ ఆటో లాక్, పానిక్ బ్రేక్ అలర్ట్, ఇంపాక్ట్-సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ మైలేజ్
రేసర్ వేరియంట్ ఇంటీరియర్‌లో ముదురు రంగు లెదరెట్ సీట్లు ఎట్రాక్టివ్ కుట్లు, చారలతో, నారింజ రంగు డాష్‌బోర్డ్ హైలైట్‌లతో కంప్లీట్ బ్లాక్ క్యాబిన్, ఆరెంజ్ యాంబియంట్ లైటింగ్ కలిగి ఉంది. ARAI ప్రకారం టాటా ఆల్ట్రోజ్ మైలేజ్ పెట్రోల్ , డీజిల్ వేరియంట్‌లకు లీటరుకు 19.17 నుండి 23.64 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే CNG వేరియంట్‌కు ఇది కిలోగ్రాముకు 26.2 కిలోమీటర్లు ఇస్తుంది.
Also Read : భారీగా పడిపోయిన టాటా మోటార్స్ సేల్స్.. మరి స్టాక్ పరిస్థితేంటి.. అసలు ఇలా ఎందుకు జరిగింది ?