Kavya Maran: చేతిలో స్మార్ట్ ఫోన్.. అపరిమితమైన డాటా.. రకరకాల సోర్స్ నుంచి వచ్చే ఫీడ్.. ఇంకా కొంచెం క్రియేటివిటీ.. ఇవన్నీ కలిస్తే ఒక వీడియో లేదా పోస్ట్.. సోషల్ మీడియాలో అప్లోడ్.. లక్షలాది లైక్స్, అంతకు మించిన వ్యూస్.. వీటి ద్వారానే చాలామంది పాపులర్ అవుతున్నారు. చాలామందిని పాపులర్ చేస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అయిన ఐపీఎల్ ఓనర్ ఎవరైనా ఉన్నారూ అంటే.. అది సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్. తన జట్టు ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు మైదానంలోకి వచ్చి సందడి చేసేది. తన జట్టు ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేది. అయితే ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోవడంతో డీలా పడింది.. మైదానంలో కన్నీరు పెట్టుకుంది. ఆమెను అలా చూసి చాలామంది అభిమానులు కంటనీరు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో సంఘీభావం తెలిపారు.. ఐపీఎల్ ముగిసి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఇంకా కావ్య ఏదో ఒక రూపంలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఆమె అభిమానులు ఆమెను ఏదో ఒక విధంగా ట్రెండింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా జరుగుతున్న చర్చ ఏంటయ్యా అంటే..
కావ్య మారన్ సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులకు ఏకైక కుమార్తె. 37వేల కోట్ల ఆస్తులకు ఏకైక వారసురాలు. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగింది. దాదాపు ఇంట్రా వర్టర్ అనుకోవచ్చు. పెద్దగా మాట్లాడదు. ఎక్కువగా ఫ్రెండ్స్ లేరు.. ఇలా ఉంటే తన కూతురు ఏమవుతుందని భయంతో ఆమెకు సన్ ఎఫ్ఎం, సన్ మ్యూజిక్ బాధ్యతలు అప్పగించారు. అందులో ఆమె సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసింది. 2016లో ఆ జట్టు డేవిడ్ వార్నర్ ఆధ్వర్యంలో విజేతగా ఆవిర్భవించింది. 2018లో కేంద్రంలో ఫైనల్ వెళ్లినప్పటికీ.. చెన్నై చేతిలో భంగపాటుకు గురైంది.. 2024 లోనూ ఫైనల్ వెళ్లినప్పటికీ..కోల్ కతా చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ లీగ్ లో కావ్య ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది.. ముందుగా చెప్పుకున్నట్టు కావ్య ఇంట్రావర్టర్ కావచ్చు. కానీ ఆమె ప్రేమ ఇతర వాటి మీద చూపిస్తుంది. అందులో సింహభాగం వాహనాలకే దక్కుతుంది. కావ్య వద్ద అత్యంత ఖరీదైన, ఆధునికమైన కార్ల కలెక్షన్ ఉంది. ఇంతకీ ఆ కార్లు ఏంటంటే..
Rolls-Royce Phantom.VIII EWB
దీని విలువ భారత కరెన్సీ ప్రకారం 12.2 కోట్లు. బంగారం, నలుపు రంగు కలబోతతో కూడిన Rolls-Royce Phantom.VIII EWB కారు కావ్య వద్ద ఉంది..6.75 లీటరు V12 ట్విన్ టర్బో చార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ ఈ కారు సొంతం. ఈ కారుకు ఇంజన్ కు 512 హార్స్ పవర్ సామర్థ్యం ఉంటుంది.. మన దేశంలో అతికొద్దిమంది శ్రీమంతుల వద్ద మాత్రమే ఈ కారు ఉంది.
Ferrari Roma
దీని విలువ భారత కరెన్సీ ప్రకారం 4.5 కోట్లు.. ఇది ఎరుపు రంగులో ఉంది. సిల్వర్ అలాయ్ వీల్స్, ఎల్లో బ్రేక్ కాలిపర్స్, 8- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిట్స్ ఈ కారుకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ. 3.9 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ డ్ V8 ఇంజన్, 690 పీఎస్, 760 ఎన్ఎం పీక్ టార్క్యూ ఈ కారు సొంతం.
Bentley Bentayga EWB
భారత కరెన్సీ ప్రకారం దీని విలువ 6 కోట్లు. కావ్య వాడే కారు క్యాండీ రెడ్ కలర్ లో ఉంటుంది. టర్బన్ స్టైల్, 22 ఇంచ్ అలాయ్ వీల్స్, 4.0 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ డ్ V8 పెట్రోల్ ఇంజన్ ఈ కారు ప్రత్యేకత. 550 PS, 770 Nm పీక్ టార్క్యూ ఈ కారు సొంతం.
BMW i7
భారత కరెన్సీ ప్రకారం దీని విలువ నాలుగు కోట్ల పైచిలుకు. కావ్య వాడే కారు బ్లాక్ సఫైర్ మెటాలిక్ రంగుతో రూపొందించింది. ఇది ఒక గంటకు 239 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.. 100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకండ్లలోనే అందుకుంటుంది.. ఈ కారుకు బుల్లెట్ ప్రూఫ్ భద్రత కూడా ఉంది. మొత్తంగా నాలుగు అధునాతన కార్లను కలిగి ఉన్న కావ్య.. వీటి కోసం దాదాపు 26.70 కోట్లు ఖర్చు చేయడం విశేషం.. ఐపీఎల్ లో కమిన్స్ కోసం 20 కోట్లను ఆఫ్ట్రాల్ అంటూ కోట్ చేసిన కావ్య కు.. ఆ డబ్బు ఒక లెక్కా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.