ఇద్దరు కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించినా కింగ్ నాగార్జున స్థాయి మాత్రం అలాగే ఉంది. Photo: Instagram
కొడుకులకు మించిన హిట్లు, అభిమానులు ఆయన సొంతం. ఇప్పటికీ యంగ్ లుక్ లోనే కనిపిస్తుంటారు. ఇంతకీ ఆయన ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? Photo: Instagram
చాలా మంది నాగార్జున రాత్రి భోజనం మానేస్తారు అనుకుంటారు. కానీ ప్రతి రోజు రాత్రి భోజనం చేస్తారు కింగ్ నాగార్జున. Photo: Instagram
రాత్రి 7 గంటల లోపు మాత్రం అన్నం తినాలి అని నిపుణులు చెబుతుంటారు. అదే విధంగా నాగార్జున కూడా పాటిస్తారట. రాత్రి 7 గం.ల లోపే ఆయన భోజనం ముగిస్తారు. Photo: Instagram
రైస్, కూరగాయలు, చికెన్, మటన్ అన్నీ తింటారట నాగార్జున. కానీ వీటిని ఒక పద్దతి ప్రకారం, తీసుకుంటారట. అతిగా తినకుండా మితంగా కావాల్సిన మోతాదులో తింటారు Photo: Instagram
వైట్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తింటారట నాగార్జున. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. Photo: Instagram
కచ్చితంగా భోజనంలో నెయ్యి ఉంటుందట. అదే విధంగా మూడు ఆకుకూరలు కూడా కచ్చితంగా ఉంటాయట. Photo: Instagram
భోజనంలో కచ్చితంగా పెరుగు కూడా ఉండాల్సిందేనట. కడుపు నిండా భోజనం కూడా ఉండాల్సిందే అంటారు నాగార్జున. Photo: Instagram
తినడం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రతి రోజు వర్కవుట్స్ చేస్తారట. 35 సంవత్సరాల నుంచి ప్రతి రోజు వ్యాయామం చేస్తుంటారట. Photo: Instagram