Miyazaki Mango: ఇప్పుడు మామిడిపండ్ల సీజన్.. మార్కెట్లో బంగినపల్లి నుంచి మొదలు పెడితే తోతాపూరి వరకు అందుబాటులో ఉన్నాయి. కిలో మామిడి పండ్ల ధర రూ. 40 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. అదే కాస్త నాణ్యంగా ఉన్న పండ్లయితే 60 లేదా 70 రూపాయల వరకు పలుకుతోంది.. కానీ మీరు చదవబోయే ఈ కథనంలో కిలో మామిడి పండ్లు ధర చెబితే అవాక్కవుతారు.. ఆశ్చర్యపోతారు.. ఆ తర్వాత మూర్చ పోతారు. పైగా ఈ మామిడి పండ్లు మనదేశంలో విస్తారంగా పండవు.. ఇంతకీ ఆ మామిడిపండ్ల కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.
జపాన్ తెలుసు కదా.. ఆసియా ఖండంలోనే ఉన్నప్పటికీ.. పూర్తి విభిన్నమైన వాతావరణం ఆ దేశం సొంతం. అక్కడ వెచ్చని వాతావరణం ఉంటుంది. సారవంతమైన నేలలు విస్తారంగా ఉంటాయి. నీటి సౌకర్యం కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాంటి ప్రాంతాలలో మియా జాకీ అనే రకానికి చెందిన మామిడి తోటలను అక్కడి రైతులు సాగు చేస్తుంటారు.. విభిన్నమైన వాతావరణంలో ఈ తోటలను సాగు చేయడం వల్ల ఈ పండ్లు ప్రత్యేకంగా ఉంటాయి.. ఈ మామిడి కాయలు ముందుగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.. పక్వానికి వచ్చినప్పుడు క్రమేపీ బూడిద రంగులోకి వస్తాయి. ఆ తర్వాత మారుతాయి.. ఈ మామిడిపండ్ల ధర కిలో వచ్చేసి దాదాపు 2.5 లక్షల వరకు పలుకుతుంది.. మనదేశంలో సిలిగురి, రాయపూర్, ఇతర ప్రాంతాల్లో ఈ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు.. మనదేశంలో సుమారు 1, 500 రకాల మామిడి పండ్లు లభ్యమవుతున్నప్పటికీ.. మియా జాకీ మాత్రం అరుదుగా కనిపిస్తుంది.
మియజాకి జపాన్ లోని క్యుషు ప్రావిన్స్ లోని విస్తారంగా పండుతుంది. 1980లోనే ఈ పండ్ల జాతిని మియా జాకీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది.. అయితే ఈ పండ్ల జాతి 1870లోనే ప్రాచుర్యంలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. జపాన్లో మియా జాకీ మామిడి పండ్లను తైయో – నో – తమగో అని పిలుస్తారు. ఆ పండు చూసేందుకు గుడ్డు, సూర్యుడి ఆకృతిని కలిగి ఉంటుంది కాబట్టి అలా పిలుస్తుంటారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఈ పంటకాలం ఉంటుంది..
ఎందుకంత ఖరీదంటే
ఈ పండ్లు ఇరవైన్ అనే మామిడి రకానికి చెందినవి. దీనిని సాగు చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతులు అవలంబిస్తారు కాబట్టి ఇవి అత్యంత ఖరీదైన పండ్లుగా వినతికెక్కాయి. ఈ పనులలో చక్కెర, పోషకాలు, మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఈ మామిడి పండ్లల్లో విటమిన్ సీ, ఏ, డైటరీ ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సీ రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. విటమిన్ ఏ కళ్ళకు మంచి చూపును ఇచ్చేందుకు దోహదం చేస్తుంది. ఫైబర్ జీర్ణక్రియ అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ మామిడి గుజ్జులో ఉన్న చక్కెర చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో ఈ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ మామిడిపండ్లపై కనీసం ఒక్క మచ్చ కూడా ఉండదు. ఈ పండ్లను తింటుంటే అమృతం తాగిన అనుభూతి కలుగుతుందట.. 2019లో మియా జాకీ మామిడి పండ్లు హోల్సేల్ మార్కెట్లో కిలో ధర 3,34,845 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది.
ఇక మనదేశంలో మియా జాకీ మామిడిని మొదట ఒడిస్సా, బీహార్ రాష్ట్రాలలో కొంతమంది రైతులు పండించారు. వారు జపాన్ నుంచి మొక్కలు దిగుమతి చేసుకున్నారు. ప్రారంభంలో ఈ మామిడి పండ్ల కిలో ధర పదివేల వరకు పలికేది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పండ్ల తోటల పెంపకం మొదలైంది. అయితే మన దేశంలో పండిన మామిడిపండ్ల రుచి, జపాన్ మామిడిపండ్లతో పోల్చితే భిన్నంగా ఉందని కొంతమంది పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. కర్ణాటకలోని ఉడిపిలో ఒక రైతు తన 1200 చదరపు అడుగుల టెర్రస్ పై మియా జాకీ మామిడి తోటను సృష్టించాడు. ఇవి మాత్రమే కాకుండా బ్రెజిలియన్ చెర్రీస్, తైవానిస్ నారింజ, శంకర్పురా జాస్మిన్ వంటి పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నాడు.. హైడ్రోఫోనిక్ విధానం ద్వారా అతడు తన టెర్రస్ పై ఒక ఉద్యానాన్ని సృష్టించాడు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చెందిన ఒక జంట కూడా మియా జాకీ మామిడి పండ్ల తోటను పెంచడం మొదలుపెట్టారు. అయితే వారు హైడ్రోఫోనిక్ విధానం లో ఈ పంటను సాగు చేయడం వల్ల ఆ పండ్లు మరింత రసవంతంగా మారాయి. తినేవాళ్ళకు సరికొత్త రుచిని అందించాయి.