Rohit Sharma and Virat Kohli: వెస్టిండీస్ జట్టుతో జట్టుతో టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా రెట్టించిన ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. ఈ సిరీస్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జాబితాలో మూడవ స్థానానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలో టీమిండియా మరో ఉత్కంఠ భరితమైన వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి అత్యంత కఠినమైన ఆస్ట్రేలియా మైదానాల మీద ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా పోటీ పడబోతోంది.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. గిల్ నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లిపోయింది. పాతిక సంవత్సరాల గిల్ నాయకత్వంలో టీమిండియా బలవంతమైన ఆస్ట్రేలియా జట్టును ఎదురుకోబోతోంది. ఈసారి టీమిండియాలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక ప్లేయర్లుగా ఉండబోతున్నారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వారిద్దరు పరిమిత వల్ల ఫార్మాట్ ఆడటం ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియా టూర్ లో ఆడేందుకు విరాట్ కోహ్లీ నేరుగా లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. అక్కడి నుంచి టీమిండియాతో కలిసి ప్రత్యేకమైన బస్సులో విమానాశ్రయం దాకా వెళ్ళిపోయాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమిండియా ఆటగాళ్లతో కలిసి విమానాశ్రయం దాకా వెళ్ళిపోయాడు. కొత్త కెప్టెన్ గిల్ మాత్రం ప్లేయర్లందర్నీ పలకరించాడు. ముందుగా రోహిత్ శర్మను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత బస్సులోకి వెళ్లి విరాట్ కోహ్లీని పలకరించాడు. అతడికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు.
కెప్టెన్ అయిన తర్వాత గిల్ మరింత కూల్ గా మారిపోయాడు. ప్లేయర్ లందరితో సమన్వయంతో వ్యవహరిస్తున్నాడు. మైదానంలో చిన్న చిన్న తప్పులు చేసినా సరి దిద్దుతున్నాడు. వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడు. బౌలింగ్లో సమన్వయం కుదిరేలా చేస్తున్నాడు. అందువల్లే టీం ఇండియా వరుస విజయాలు సాధిస్తోంది.. ఆసియా కప్, అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్.. ఇప్పుడు వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని టీమిండియా సత్తా చాటింది. దీనంతటికి ప్రధాన కారణం గిల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
✈️
Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge #AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj
— BCCI (@BCCI) October 15, 2025