Shreyas Iyer : ఐపీఎల్ లో ఇప్పటికే మూడు జట్లకు నాయకత్వం వహించిన అతడు.. మ్యాగ్జిమం తన ఆట తీరును ప్రదర్శించాడు. అందువల్లే ఏటికేడు తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. పరుగుల వరద పారించి.. తను ఏమిటో నిరూపించుకున్నాడు. ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చిన అతడు.. తనకంటూ ఒక నేపథ్యాన్ని సృష్టించుకున్నాడు. మామూలుగా కాదు పరుగుల వరద పారిస్తూ.. బౌలర్లను చితక బాదుతూ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
2015 ఐపీఎల్ లో 439
2018 ఐపీఎల్ లో 411
2019 ఐపీఎల్ లో 463
2020 ఐపిఎల్ లో 519
2022 ఐపీఎల్ లో 401
2025 ఐపీఎల్ లో 603 పరుగులు చేసి.. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
ఇక సిక్సర్లు కొట్టిన జాబితాలో అయ్యర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అయ్యర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.. ముంబై జట్టుపై ఏకపక్ష ఆధిపత్యాన్ని సాగించాడు.. ఇక ప్రస్తుత ఐపీఎల్ లో అయ్యర్ ఏకంగా 38 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు… 2014లో మ్యాక్స్వెల్ 36 సిక్సర్లు కొట్టగా.. అతడి రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. 2019లో గేల్ 34.. 2022లో లివింగ్ స్టోన్ 34, 2018లో కేఎల్ రాహుల్ 32 సిక్సర్లు కొట్టారు.. ఇక అహ్మదాబాద్ మైదానంలో శ్రేయస్ అయ్యర్ గడచిన ఎనిమిది ఇన్నింగ్స్ లలో 67, 8*, 9, 37, 58*, 97*, 57*, 87* పరుగులు చేశాడు. ఇక 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారధిగా ఉండి.. ఆ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. 2024లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు. 2025 లో పంజాబ్ జట్టును చివరి వరకు ప్రయాణించేలా చేశాడు. అంతేకాదు ఐపీఎల్ నాకౌట్లో పంజాబ్ జట్టు ఇప్పటివరకు 204 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయలేదు. అయ్యర్ పుణ్యం వల్ల దానిని పంజాబ్ చేసేసింది. ఫైనల్ మ్యాచ్లో అయ్యర్ గనుక వీర విహారం చేస్తే.. సిక్సర్ల వర్షం కురిపిస్తే తిరుగు ఉండదు. ఇప్పటికే క్వాలిఫైయర్ -1 లో అయ్యర్ జట్టు ఓడిపోయింది. రజత్ పాటిదార్ సేన పై రివెంజ్ తీర్చుకోవాలని బలమైన పట్టుదలతో ఉన్నాడు అయ్యర్. క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో చేసిన తప్పును ఫైనల్ మ్యాచ్లో రిపీట్ చేయకుండా ఉంటే.. అయ్యర్ భారీ స్కోర్ చేయడం గ్యారంటీ. అదే జరిగితే కన్నడ జట్టుకు ఇబ్బందులు తప్పవు.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ముంబై, చెన్నై పేరుపొందాయి. ఈ రెండు జట్లు కూడా రోహిత్, ధోని నాయకత్వంలో ట్రోఫీలు సాధించాయి. కానీ ధోని, రోహిత్ ఇతర జట్లకు నాయకత్వం వహించి ట్రోఫీలు అందుకునేలాగా చేయలేదు. కానీ వారందరికంటే భిన్నంగా అయ్యర్ మూడు విభిన్నమైన జట్లకు నాయకత్వం వహించి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇందులో ఒకసారి రన్నర్ అప్, మరొకసారి విజేతగా ఢిల్లీ, కోల్ కతా జట్లను నిలిపాడు. ఇప్పుడు పంజాబ్ జట్టును చివరి అంచె పోటీ దాకా తీసుకెళ్లాడు. ఒకరకంగా ఐపీఎల్లో సాధారణ ఆటగాడిగా ఆడేందుకు కాకుండా.. తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకుని ఐపిఎల్ ను ఏలేయడానికి అయ్యర్ వచ్చాడని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.