RCB vs PBKS Final Mania :ఐపీఎల్ నేటితో ముగుస్తోంది. తాజా ఎడిషన్ లో ఫైనల్ మ్యాచ్ మంగళవారంతో పూర్తవుతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియంలో చివరి పోటీ జరుగుతుంది. ఈ సీజన్లో గొప్ప గొప్ప జట్ల వల్ల కానిది పంజాబ్ జట్టు చేసి చూపించింది. బెంగళూరు కూడా అదే దారిలో కొనసాగింది. మొత్తంగా ఈ రెండు జట్లు ఎవరూ ఊహించని విధంగా ఐపీఎల్ ఫైనల్ లోకి వచ్చేసాయి. గొప్ప గొప్ప జట్లను సైతం మట్టికరిపించి చివరి అంచె పోటీ దాకా ప్రయాణం సాగించాయి. ఐపీఎల్ ప్రారంభమై ఇన్ని సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఈ రెండు జట్లు ట్రోఫీని అందుకోలేకపోయాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా సరికొత్త చరిత్ర అవుతుంది. ప్లేయర్ల విషయంలో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పోటీ ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు గెలుస్తుందట.. ఏకంగా 6.4 కోట్లు బెట్ పెట్టిన ఈ మహానుభావుడె
ఐపీఎల్.. అందులోనూ ఫైనల్.. పోరాడేది పంజాబ్, బెంగళూరు జట్లు. పంజాబ్ తో పోల్చితే బెంగళూరుకు అభిమానులు ఎక్కువగా ఉంటారు. అయితే పంజాబ్ ఫైనల్ వెళ్లడంతో ఆ జట్టు అభిమానులు కూడా ఏం తగ్గడం లేదు. పైగా సోషల్ మీడియాలో దుమ్ము రేపే విధంగా వీడియోలు క్రియేట్ చేసి అదరగొడుతున్నారు. అప్పట్లో తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాహుబలి సినిమాలోని ఒక సన్నివేశాన్ని పంజాబ్ అభిమానులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒక సన్నివేశంలో బాహుబలి బల్లాల దేవ కుమారుడిని చంపేసి అతటి తలను తీసుకొస్తాడు. ఆదృశాన్ని బల్లాలదేవ బైనాక్యూలర్ లాంటి పరికరంలో చూస్తాడు.. దానిని తన తండ్రి బిజ్జల దేవ చూసి ఒక్కసారిగా హతాశుడయిపోతాడు. పైగా బాహుబలి బల్లాల దేవ కుమారుడి శిరస్సును తన తల్లి దేవసేన చేతిలో ఉంచుతాడు. అదే సన్నివేశాన్ని పంజాబ్ అభిమానులు ఇప్పుడు రీ క్రియేట్ చేశారు. ముంబై జట్టు చేతిలో విజయం సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యా తలను ప్రీతి జింటా పట్టుకున్నట్టు.. బెంగళూరు మీద దండెత్తడానికి అయ్యర్ వస్తున్నట్లు.. ఆ దృశ్యాలను చూసి విరాట్ కోహ్లీ, బెంగళూరు కెప్టెన్ పాటిదార్ ఆశ్చర్యపోయినట్టు.. పంజాబ్ అభిమానులు బాహుబలి సినిమాలోని దృశ్యాన్ని ఆ విధంగా రీ క్రియేట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.. ఈ వీడియోని చూసిన వాళ్లంతా ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి రా బాబూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ” మీ క్రియేటివిటీకి ఓ దండం రా బాబూ.. ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయి.. ఈ వీడియో చూసి బెంగళూరు అభిమానులు కన్నీటి పర్యంతమవుతారని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.
Final mein entry pic.twitter.com/bfzreMEzIM
— Gagan (@1no_aalsi_) June 2, 2025